కాంగ్రెస్‌కు చెందిన 23 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఎదురుదాడికి దిగారు. కేసీఆర్‌తో మన ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారా? వాళ్ల ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారా? అనేది ఎన్నికల తర్వాత తేలనుందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేసీఆర్ మాటలకు ఆగస్టులో సమాధానం చెబుతాం. ప్రభుత్వం కూలిపోతుందని కేసీఆర్ ఏ ఆలోచనతో చెప్పారో ఆయనకే తెలియాలని, కేసీఆర్ ఏం చేసినా తిప్పికొట్టడం మాకు తెలుసునని జగ్గారెడ్డి అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో నాయకులకు ఏమీ లేదు… బీఆర్‌ఎస్‌లో ముగ్గురు, బీజేపీలో ఇద్దరు నేతలు మాత్రమే ఉన్నారు. బీజేపీ గ్రాఫ్ పడిపోవడంతో అమిత్ షా, మోడీలకు నిద్ర పట్టడం లేదు. విజయం మావైపే ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వంపై ఏఐసీసీకి పూర్తి నమ్మకం ఉందని జగ్గారెడ్డి అన్నారు. బీజేపీ వాళ్ళు దేశభక్తులు అంటూ డబ్బా కొట్టుకుంటున్నారు. అసలైన దేశభక్తులు రాహుల్ గాంధీ కుటుంబమే. రాహుల్ గాంధీకి డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు అని జగ్గారెడ్డి అన్నారు.