Tuesday, November 26, 2024

గ‌వ‌ర్న‌ర్ పై మంత్రి జ‌గ‌దీష్ ఫైర్‌

సూర్యపేట : తెలంగాణ గవర్నర్ తమిళి సై పై మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె గవర్నరా, బీజేపీ నాయకురాలా అని, బిల్లులను పెండింగ్ లో ఉంచే అధికారం ఆమెకెక్కడిద‌ని మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి ప్ర‌శ్నించారు. ప్రజాస్వామిక ప్రభుత్వ చట్టాలను నిలువరించే హక్కు ఎవరిచ్చారని మండిప‌డ్డారు. రాజ్యాంగ మూలసూత్రాలను కాదని చట్టాలు చెయ్యలేద‌ని, అధిగమించామనిపిస్తే అడ్డుకునే అధికారం సుప్రీం కోర్టు ధర్మాసనానికే ఉందన్నారు. తెలంగాణ బిల్లుల ఆమోదానికి ప్రభుత్వం న్యాయపరంగా ముందుకు వెళ్తోందని జగదీష్ రెడ్డి చెప్పారు. రాజ్యాంగ వ్యవస్థకు కేంద్రం తూట్లు పొడిచేలా వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్నారు. బీజేపీ యోతర రాష్ట్రాల అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం కుట్ర ప‌న్నింద‌న్నారు. కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమాలకు మోకాలొడ్డే ప్రయత్నం కేంద్ర స‌ర్కార్ చేస్తుంద‌న్నారు. ఇదంతా గవర్నర్ ను అడ్డుపెట్టి కేంద్రం ఆడుతున్న నాటక‌మే అన్నారు. రాజ్ భవన్ పైరవీలకు కేంద్రంగా మారకూడదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీ తపన అని, అదే నిజం అనుకుంటే ఆ పార్టీకి అంతకు మించి నష్టం జరుగుతుంద‌న్నారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు గవర్నర్ ప్రయత్నిస్తున్నారని జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement