- పబ్లిసిటీ చేయలేదు కాబట్టి ఎవరికీ తెలియదు
- ఆ కుటుంబం ఎక్కువగా నష్టపోయింది
సంధ్య థియేటర్ ఘటనలో బాధిత కుటుంబాన్ని సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు పరామర్శించలేదన్న విమర్శలపై నటుడు జగపతిబాబు స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు.
సినిమా షూటింగ్ పూర్తి కాగానే బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు తాను ఆస్పత్రికి వెళ్లినట్లు తెలిపారు. చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ తండ్రి, సోదరిని పలకరించేందుకు అక్కడికి వెళ్లినట్లు పేర్కొన్నారు. శ్రీతేజ్ అందరి ఆశీస్సులతో త్వరగా కోలుకుంటాడని వారికి భరోసా ఇచ్చినట్లు తెలిపారు.
అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఆ కుటుంబం కాబట్టి… నా వంతు సపోర్టు ఇవ్వాలనుకున్నాను. దానికి పబ్లిసిటీ చేయలేదు. అందుకే ఎవరికీ ఆ విషయం తెలియలేదు. దానిపై స్పష్టత ఇవ్వడానికే ఈ పోస్టు అని తెలిపారు.
అందరికంటే ఎక్కువగా ఆ కుటుంబం నష్టపోయింది.. అందుకే వారికి నా మద్దతు ఇవ్వాలనుకున్నాను. దానికి పబ్లిసిటీ చేయలేదు… అందుకే ఆ విషయం ఎవరికీ తెలియలేదని పేర్కొన్నారు. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేందుకే ఈ పోస్ట్ పెడుతున్నట్టు తెలిపారు.