కడప (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 23,24,25 తేదీల్లో కడప జిల్లాలో పర్యటించనున్నారు. అధికారిక వివరాల మేరకు 23వ తేదీ ఉదయం 11. 30 గంటలకు కడపకు చేరుకొని స్థానికంగా కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు. 2 గంటలు హెలికాఫ్టర్ లో కమలాపురం వెళ్లి అక్కడి కార్యక్రమాలలో పాల్గొని సాయంత్రం ఇడుపులపాయ చేరుకొని రాత్రి బస చేస్తారు. 24వ తేదీ మధ్యాహ్నం పులివెందుల కు వెళ్లి కొన్ని కార్యక్రమాలలో పాల్గొని రాత్రికి తిరిగి ఇడుపులపాయ చేరుకుంటారు 25వ తేదీ ఉదయం మళ్ళీ పులివెందులకు వెళ్లి క్రిస్మస్ ప్రార్ధన సంబరాలలో పాల్గొని 11 గంటలకు కడపకు వచ్చి విమానంలో అమరావతికి వెళ్ళిపోతారు..
ఈ పర్యటనలో భాగంగా 23వ తేదీ తొలుత కడప లోని అమీన్ పీర్ దర్గా ని సందర్శిస్తారు.. మధ్యాహ్నం కమలాపురంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. 24వ తేదీ ఇడుపులపాయలోని తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు.. అదేరోజు పులివెందులలో ఆధునీకరించిన రోడ్డు కూడళ్లను కూరగాయల మార్కెట్, మైత్రి లే అవుట్, రాయలపురం బ్రిడ్జి, వై ఎస్ ఆర్ బస్టాండ్ , అహోబిలపురం స్కూల్, 10 మిలియన్ లీటర్ల మురుగునీటి ట్రీట్మెంట్ ప్లాంట్ లను ప్రారంభించనున్నారు.