Saturday, November 23, 2024

జగన్నాథ రథయాత్ర, ఘనంగా పహండి ఉత్సవాలు.. భక్తులతో కిక్కిరిసిన పూరి

పూరి: ఒడిశాలోని పూరిలో శుక్రవారం జగన్నాథ యాత్రలో భాగంగా పహండి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రెండేళ్ల తర్వాత రథ యాత్ర కోసం భక్తులకు అనుమతి ఇచ్చారు. కోవిడ్‌ మహమ్మారి వల్ల గడిచిన రెండేళ్లు భక్తులను అనుమతించిన విషయం తెలిసిందే. మూడు రథాలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఇప్పటికే లక్షలాది మంది భక్తులకు అనుమతి ఇచ్చారు. కోవిడ్‌ మహమ్మారి వల్ల గడిచిన రెండేళ్లు భక్తుల ను అనుమతించని విషయం తెలిసిందే.

మూడు రథాలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు పూరీ చేరుకున్నారు. జగన్నాథుడు, భల భధ్రుడు, సుభద్రా రథాలు యాత్ర కోసం సిద్దం అయ్యాయి. పహండిలో భాగంగా బల భద్రుడు చెక్క విగ్రహాన్ని తల ద్వాజ రథం వద్దకు తీసుకు వెళ్లారు. బల భధ్రుడి తర్వాత దేవి సుభధ్ర విగ్రహాన్ని దేబదలన రథం వద్దకు తీసుకువచ్చారు. పూరి శ్రీ మందిరం నుంచి భగవాన్‌ జగన్నాథుడి విగ్రహాన్ని అత్యంత శోభాయమానంగా అలంకరించిన నందిఘోష రథం వద్దకు తీసుకువచ్చారు. లక్షలాదిగా తరలి వచ్చిన భక్తులు మూడు రథాలను హరినామ స్మరణల మధ్య లాగారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement