Tuesday, September 24, 2024

‘జగనన్నకు చెబుదాం’ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన జ‌గ‌న్ – తాడేప‌ల్లి నుంచి LIVE

YouTube video

అమరావతి, ఆంధ్రప్రభ: పారదర్శక పాలనకు పెద్దపీట వేస్తున్న వైసీపీ సర్కార్‌ ప్రజా ఫిర్యాదుల కోసం మరో అడుగు ముందుకేసింది. గతంలో స్పందన పేరుతో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కారాలు చూపిన సీఎం జగన్‌ ప్రభుత్వం ప్రస్తుతం స్పందన 2.0 కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ”జగనన్నకు చెబుదాం” అన్న పేరుతో నూతన కార్యక్రమాన్ని సీఎం జగన్‌ మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు తమ ఫిర్యాదులను నేరుగా సీఎం జగన్‌కే విన్నవించుకునే అవకాశం లభించనుంది. దీంతో ప్రజల ఫిర్యాదులు స్పందన కంటే త్వరిత గతిన పరిష్కారం కానున్నాయి. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ పాలనలో కీలకంగా నిలిచిన స్పందన కార్యక్రమాన్ని పూర్తిగా అప్‌ గ్రేడ్‌ చేస్తూ.. స్పందనలో పరిష్కారం కాని అరకొర సమస్యలు కూడా సీఎం నేతృత్వంలో పనిచేసే జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో పరిష్కారించేందుకు సిద్ధమైంది. జగనన్నకు చెబుదాం కార్యక్రమం కోసం సీఎం జగన్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక టీ-ం పనిచేయనుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఈ టీ-ం నెట్‌ వర్క్‌ తో కనెక్ట్‌ అయి చివరగా వివిధ ప్రభుత్వ విభాగాధిపతుల స్థాయికి చేరి ప్రధానమైన ప్రజా సమస్యలు కూడా ఒకే దరఖాస్తుతో ప్రారంభం అయ్యేలా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించింది.

నేరుగా ఫిర్యాదు చేయొచ్చు
ప్రజలు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి కాల్‌ చేసి వారి సమస్యలను చెప్పుకోవడానికి వీలు కల్పిస్తుంది. స్పందన కంటే మెరుగ్గా జగనన్నకు చెబుదాంను నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించింది. జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రజలకు ముఖ్యమంత్రితో ప్రత్యక్ష అనుసంధానాన్ని అందిస్తుంది. స్వయంగా ముఖ్యమంత్రి మరియు వారి కార్యాలయం ప్రత్యక్ష పరిశీలనలో ఉంటు-ంది. తద్వారా సీఎం ప్రజల ఫిర్యాదులను నేరుగా విని స్పందించవచ్చు. గుణాత్మక సేవలు అందించే ఈ కార్యక్రమంలో మొత్తం ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుంది. వ్యక్తిగత, గృహ ఫిర్యాదులను పరిష్కరించడం అత్యంత సమర్థవంతంగా సంబంధిత అధికారుల ప్రాధాన్యతగా ఉంటు-ంది.

సమస్యల పరిష్కారమే లక్ష్యం
సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలకు సంబంధించి వ్యక్తిగత స్థాయిలో ప్రజలకు ఎదురయ్యే సమస్యల్ని మరింత మెరుగ్గా నాణ్యమైన పరిష్కారం చూపడం కోసమే జగనన్నకు చెబుదాం ముఖ్య ఉద్దేశ్యంగా తెలుస్తోంది. సంక్షేమ పథకాలు అందుకోవడంలో ఇబ్బందులున్నా, ప్రభుత్వ సేవల విషయంలో ఏమైనా అడ్డంకులు ఎదురైనా జగనన్నకు చెబుదాంకు ఫిర్యాదు చేయొచ్చు. ప్రజలు వారి ఇంటి నుండే నేరుగా 24/7 అంకితమైన హెల్ప్‌లైన్‌ నంబర్‌ – 1902 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్‌ చేయవచ్చు, ఫిర్యాదు చేసుకొని ఐడీని కేటాయిస్తారు. ఎప్పటికప్పుడు ఆర్జీ స్టేటస్‌ను ఎస్‌ఎంఎస్‌ ద్వారా అప్‌డేట్‌ చేసే విధంగా ఏర్పాట్లు చేశారు.

ప్రాసెస్‌ రీ-ఇంజనీరింగ్‌: ప్రతి శాఖ ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను విశ్లేషించి, దానిని సరళీతం చేయడానికి మార్పులు చేసారు, ఫలితంగా, ఫిర్యాదుల యొక్క వేగవంతమైన మరియు మెరుగైన నాణ్యత పరిష్కారం లభిస్తుంది. ప్రాజెక్ట్‌ పర్యవేక్షణ: స్థానిక మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఫిర్యాదులు సమర్థవంతంగా పరిష్కరించబడుతున్నాయని నిర్ధారించుకోవడానికి అన్ని బృందాలు కలిసి పని చేస్తాయి. పౌర సంబంధాల అప్‌గ్రేడ్‌ : కాలింగ్‌ డాష్‌బోర్డ్‌, నాణ్యత మదింపు ప్రక్రియలు మరియు ఫీడ్‌బ్యాక్‌ యంత్రాంగాలను అప్‌గ్రేడ్‌ చేయడం ద్వారా ప్రజలు వ్యవస్థతో మరింత మెరుగ్గా సంభాషించే విధానాన్ని మెరుగుపరచారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం వ్యక్తిగత లేదా గృహ-స్థాయి (సేవలను నిరాకరించడం లేదా తిరస్కరించడం) ఫిర్యాదులకు పెద్దపీట వేసింది. మౌలిక సదుపాయాల అభ్యర్థనల కోసం, ప్రజలు తమ స్థానిక ప్రజా ప్రతినిధిని సంప్రదించాల్సి ఉంటుంది. ఏదైనా ఫిర్యాదు చేసేప్పుడు తమ పేరు మరియు ఆధార్‌ నంబర్‌ వంటి ప్రాథమిక సమాచారాన్ని అందించాలి. అవసరమైతే, మీరు ఫిర్యాదుకు సంబంధించిన ప్రదేశాన్ని తెలియచేయాల్సి ఉంటు-ంది

జిల్లాకు రూ.3 కోట్ల ఫండ్‌
ఫిర్యాదును పరిష్కరించడానికి గ్రీవెన్సు పరిష్కార అధికారిని ఆయా శాఖ కేటాయిస్తుంది. ఆ గ్రీవెన్సు పరిష్కార అధికారి ఆ ఫిర్యాదుపై విచారణ చేసే బాధ్యతలను ఒక ప్రత్యేక విచారణాధికారికి కేటాయిస్తారు, ఆ అధికారి విచారణ నివేదికను సమర్పించాల్సి ఉంటు-ంది, ఈ విచారణ నివేదిక ఆధారంగా గ్రీవెన్సు పరిష్కార అధికారి ఫిర్యాదుదారుకు వివరణాత్మకమైన నివేదిక అందజేస్తారు. ఈ కార్యక్రమం నిర్వహణకు సంబంధించి ఒక్కో జిల్లాకు 3 కోట్ల ఇంప్రెస్ట్‌ ఫండ్‌ కేటాయించారు. మండల స్థాయి నుంచి ముఖ్యమంత్రి కార్యాలయ స్థాయి వరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు- చేశారు. ప్రజా ఫిర్యాదుల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement