సీఎం జగన్ పలు పథకాలను ప్రవేశపెట్టారు. వాటిల్లో ఒకటి జగనన్న విద్యా దీవెన. దీనిలో భాగంగా పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ లో మూడో విడత నగదుని చెల్లించనుంది ప్రభుత్వం. ఈ ఏడాది మూడో విడతగా దాదాపు 11.03 లక్షల మంది విద్యార్ధులకు రూ. 686 కోట్లను జగన్ క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి నేరుగా వారి తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. తల్లులు ప్రతీ మూడు నెలలకోసారి కాలేజీలకు నేరుగా వెళ్ళి ఫీజులు చెల్లించడం ద్వారా వారి పిల్లల చదువులు, కాలేజీలలో వసతులు పరిశీలించి లోటుపాట్లు ఉంటే యాజమాన్యాలను ప్రశ్నించగలుగుతారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఉన్నత విద్య చదివే అవకాశం, అందరికీ వర్తింపు, తద్వారా అన్ని విధాల కుటుంబాలు స్ధిరపడనున్నాయి.
జగనన్న విద్యా దీవెన
మొదటి విడత – 19 ఏప్రిల్ 2021
రెండో విడత – 29 జులై 2021
మూడవ విడత – 30 నవంబర్ 2021
నాలుగవ విడత – ఫిబ్రవరి 2022.