అమరావతి, ఆంధ్రప్రభ: అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు గెలుపొం దడం పెద్ద సవాల్‌గా మారింది. అసెంబ్లి ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు రావడం ఒకవైపు, వైయస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వై నాట్ 175 నినా దంతో ముందుకు వెళ్లడం మరోవైపు ఉండటంతో ఈ ఎన్నికలను అధినేత సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. అయితే, ఉపాధ్యాయులతో వైరం ఒకవైపు, జాబ్ కేలండర్ సకాలంలో భర్తీ చేయలేదనే ఆరోపణలు మరోవైపు ఇప్పుడు అధికార పార్టీని ఆలోచనలో పడేస్తున్నాయి. ఈక్రమంలోనే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం మండ లిలో ఖాళీగా ఉన్న రెండు టీ-చర్ల, మూడు పట్టభద్రుల ఎమ్మె ల్సీ స్థానాలు వెరసి మొత్తం ఐదు స్థానాలను ఎట్టిపరిస్థితు ల్లోనూ -కై-వసం చేసుకునేందుకు కసరత్తు ప్రారంభించారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఈ ఐదు స్థానాలను అధికార వైకాపా కనుగ తన ఖాతాలో వేసుకోగలిగితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో తమ విజయం ఇప్పటికంటే ఘనంగానే ఉంటుం దన్న ప్రచారం కూడా పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఈనేప థ్యంలో ఈ ఐదు స్థానాల్లో పైచేయి సాధించేందుకు ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వ్యూహాత్మంగా అడుగులు వేస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన నోటిఫికేషన్
శాసనమండలిలో ఖాళీగా ఉన్న 13 స్థానాలకు మార్చి 13న ద్వైవార్షిక ఎన్నికల నిర్వహణకు భారత ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో ఎనిమిది స్థానాలు స్థానిక సంస్థల నుండి ఎన్నుకోవాల్సి ఉండగా మిగి లిన ఐదింటిలో రెండు ఉపాధ్యామ, మూడు గ్రాడ్యుయేట్ల స్థానాల నుండి అభ్యర్ధులను ఎన్నుకోవాల్సి ఉంది. అయితే, ఇప్పటికే స్థానిక సంస్థల్లో అధికార వైకాపాకు విస్పష్టమైన మెజారిటీ- ఉన్నందున మొత్తం ఎనిమిది స్థానిక అధికార ఎమ్మెల్సీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. అయితే, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు,శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం పట్టభద్రుల ఎమ్మల్సీ స్థానాలతోపాటు ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు అనే రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో గెలుపు అంత సులువు కాదనే అంశం ఇప్పుడు తెరపైకి వస్తోంది.
గెలుపు ప్రాథమ్యాలపై చర్చ
అటు ఉపాధ్యాయ, ఇటు పట్టభద్రుల స్థానాల గెలుపుపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఉపాధ్యాయులకు సంబంధించి పీఆర్సీ అంశం నుండి ప్రభుత్వంతో విబేధాలు ప్రారంభయ్యాయి. అవి చిలికి చిలికి గాలివానలా మారి ఉపాధ్యాయులను ఎన్నికల విధులనుండి తప్పించే వరకూ వెళ్లాయి. ఇదే క్రమంలో ఉపాధ్యాయులకు ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ పెట్టడంతో వారు ప్రభుత్వ తీరుపై మరింత మండిపడుతున్నారు. దీనికితోడు వేతనాలు సకాలంలో అందడంలేదని, పెండింగ్ డీఏలు ఇవ్వలేదన్న అసంతృప్తులు ఉపాధ్యాయ వర్గాల్లో పెద్ద ఎ త్తున ఉన్నాయి. ఈక్రమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానా ల్లో గెలుపొందడం అంత తే లికైన పనికాదని అంటున్నా రు. అదే సమయంలో ఉపా ధ్యాయులకు పనిభారం తగ్గించడంతోపాటు బదిలీల అంశంలోనూ ప్రభుత్వం వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసు కుందని మరో వాదన కూడా ఉంది. అంతేకాకుండా మెటర్నటీ లీవుల అంశం లోనూ ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిం చిన నేపథ్యంలో గెలుపు భారీ స్థాయిలో కాకపోయినా, గెల వడం ఖాయమనే వాదన కూడా లేకపోలేదు. ఇక పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి జాబ్ కేలండర్ ప్రతి ఏటా విడుదల చేస్తామని ప్రకటించి దానిని అరకొరగా విడుదల చేస్తున్నారని నిరుద్యోగ యువతను ప్రతిపక్షాలు ప్రేరేపిస్తున్నా యి. ఇది ఎంత మేరకు ప్రభావం చూపుతుందన్నది చర్చ నీయాంశంగా మారింది. ఈక్రమంలోనే గత మూడేళ్లలో
ప్రభుత్వం సచివాలయాల్లో 1.25 లక్షల ఉద్యోగాలు కల్పిం చిందని, వివిధ శాఖల్లో 2.06 లక్షల ఖాళీలను భర్తీ చేసిందని, ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన అదనంగా 3.71 లక్షల ఉద్యో గాలు కల్పించిందని వైఎస్సార్‌సీపీ నేతలు చెబుతున్నారు. ఇది ఓటర్లపై, ముఖ్యంగా గ్రాడ్యుయేట్లపై సానుకూల ప్రభా వం చూపుతుందని వారు భావిస్తున్నారు.
నేతలకు సీఎం దిశానిర్దేశం
అటు ఉపాధ్యాయ, ఇటు పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వైయస్సార్సీపీ ప్రతిపాదించిన అభ్య ర్ధులు గెలిచి తీరాలని, ఆమేరకు స్థానిక నేతలు చిత్తశుద్ధితో కృషి చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆయా నియోజకవర్గాల్లోని నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. గడచిన మూడు సంవత్సరాల పది నెలల కాలంలో ప్రభుత్వం ఏం చేసిందనే దాని తోపాటు కరోనా ఆర్ధిక సంక్షోభాన్ని సైతం తట్టుకుని ఉద్యోగుల వేతనాల్లో ఎటు వంటి కోత లేకుండా అం దించిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందన్న విషయాన్ని వారిలోకి తీసు కెళ్లాలని ఆయన సూచిం చినట్లు తెలుస్తోంది. ఇక అధి కారంలోకి వచ్చిన వెంటనే 17 శాతం ఐఆర్ ఇచ్చిన విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు సమాచారం.
ఇక ఉద్యోగుల సంక్షేమంకోసం ప్రభుత్వం చిత్తశుద్దితో కట్టుబడి ఉందని, నివాస స్థలాల కేటాయింపులో వారికి ప్రా ధాన్యత కల్పిచడం వంటి అనేకానేక కార్యక్రమాలు చేపట్టిం దని, ఒకటి రెండు అంశాల్లో చేయలేకపోయినా వాటిని కూడా వీలై నంత త్వరలోనే పూర్తిచేసే దిశగా చర్యలు తీసుకుంటా మని వారికి చెప్పాలని సీఎం స్థానిక నేతలను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆమేరకు నేతలు వెంటనే కార్యోన్ముఖులు కా వాలని ఆయన స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం.