వైసీపీ శాశ్వత అధ్యక్ష పదవి ప్రతిపాదనను సీఎం జగన్ తిరస్కరించారని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… తమ ప్రతిపాదనను సీఎం జగన్ అంగీకరించలేదన్నారు. మళ్లీ ఐదేళ్లకు పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుందన్నారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘానికి చెబుతామన్నారు.
వైసీపీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎంపికైనట్లు వచ్చిన వార్తలపై సీఈసీ స్పందించింది. పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లదని తెలిపింది. ఏ పార్టీలోనూ శాశ్వత పదవులు ఉండకూడదని ఎన్నికల సంఘం పేర్కొంది. ఏ పార్టీకి అయినా తరచూ ఎన్నికలు జరగాలని.. శాశ్వత అధ్యక్షుడు లేదా శాశ్వత పదవులు.. ప్రజాస్వామ్యానికి విరుద్దమని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. దీనిపై సజ్జల స్పందించి.. పై విధంగా తెలిపారు.
- Advertisement -