లోకేష్ పాదయాత్రకు అడ్డంకులు పెడితే జగన్ ఖర్మ అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. బుధవారం లోకేష్ పాదయాత్రకు ‘యువగళం’ పేరు ఖరారు కాగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో యువగళం జెండాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర కు సిద్ధయ్యారని, 2023 జనవరి 27న లోకేష్ పాదయాత్రను ప్రారంభించనున్నారన్నారు. లోకేశ్ పాదయాత్రకు అడ్డంకులు పెడితే జగన్ ఖర్మ అన్నారు. ఆనాడు జగన్ పాదయాత్ర చేస్తే.. దారిలో ఉన్న గడ్డిని కూడా క్లియర్ చేశామన్నారు. లోకేష్ పాదయాత్రపై పోలీసుల అనుమతి కోరతామని, లోకేష్ అడుగులో అడుగేయాలని యువతను కోరుతున్నామని అచ్చెన్నాయుడు అన్నారు. చాలా కాలం తర్వాత పోలీస్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ఇచ్చారని, కానీ చాలా మందికి ఏజ్ బార్ అయిందన్నారు. లోకేష్ ఈ అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారని.. పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో ఏజ్ బార్ అయిన యువతకు వెసులుబాటు కల్పించారన్నారు.
లోకేష్ యాత్రకు అడ్డంకులు పెడితే జగన్ ఖర్మ : టీడీపీ నేత అచ్చెన్నాయుడు
Advertisement
తాజా వార్తలు
Advertisement