Thursday, November 21, 2024

ఉద్యోగులు, పోలీసుల పట్ల జగన్ వ్యవహారం దుర్మార్గం : య‌న‌మ‌ల

రాష్ట్రంలో ఉద్యోగులు, పోలీసుల పట్ల సీఎం జగన్ వ్యవహారం దుర్మార్గమని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… ఉద్యోగులను వాడుకుని వదిలేయడంలో సీఎం జగన్ రెడ్డి టాప్ అని తెలిపారు. అడ్డూ అదుపూ లేని అప్పులతో ఆర్ధిక వ్యవస్థ గాడి తప్పిందన్నారు. అవసరం తీరే వరకే అన్న.. అవసరం తీరాక దున్న అన్నట్లు జగన్ వైఖరి ఉందన్నారు. ప్రతిపక్షాల అక్రమ అరెస్టులకు అడ్డగోలుగా వాడుకుని.. అవమానకర రీతిలో సవాంగ్‌ను గెంటేశారని యనమల తెలిపారు.

డీజీపీ స్థాయి వ్యక్తికి పోస్టింగ్ ఇవ్వకుండా అవమానించారన్నారు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను అన్నా అంటూనే.. గెంటారన్నారు. పీవీ రమేష్, అజేయకల్లాం రెడ్డికి పొమ్మనకుండా పొగబెట్టారన్నారు. అజేయకల్లాంతో న్యాయమూర్తులపై విషం కక్కించి తర్వాత పంపేశారన్నారు. చీకటి జీవోల ఆధ్యుడు ప్రవీణ్ ప్రకాశ్ ను ఆకస్మికంగా ఢిల్లీ తరిమేశారన్నారు. జగన్ రెడ్డి వ్యవహారశైలిని, నైజాన్ని ఉద్యోగులు, పోలీసులు అర్ధం చేసుకోవాలన్నారు. ఆస్తులు తాకట్టు పెట్టి, భూములు అమ్మి భారీగా ఆదాయం సమకూర్చుకున్నారన్నారు. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు కూడా ఇవ్వలేని స్థితిలో రాష్ట్రం ఉందని య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement