Friday, November 22, 2024

28న విశాఖ‌కు జ‌గ‌న్,కెసిఆర్…

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావులు ఒకేరోజు ఒకే వేదికలో ఒకే కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. దీంతో వారి పర్యటన పై రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. ఈ నెల 28వ తేదీ విశాఖ శ్రీ శారదా పీఠంలో రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజ రు కావాలని శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ఇటీవల తాడేపల్లి వచ్చి స్వయంగా సీఎం జగన్‌ను యాగానికి ఆహ్వానించారు. అదేవిధంగా గతంలో హైదరాబాద్‌లో రాజశ్యామల యాగం తలపెట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కూడా స్వామీజీ విశాఖకు ఆహ్వా నించారు. దీంతో ఇద్దరు ముఖ్యమంత్రులు రాజశ్యామల యాగంలో పాల్గొని స్వామి ఆశీస్సులు తీసుకునేందుకు శనివారం విశాఖకు రానున్నారు. ఈ నేపధ్యంలో రెండు రాష్ట్రాల్లోని ప్రధాన రాజకీయ పార్టీల్లో కొత్త చర్చ మొదలైంది. ఈ యాగం అనంతరం ఇద్దరు సీఎంలు కలిసి మాట్లా డుకునే అవకాశాలున్నాయని జోరుగా ప్రచారం కూడా జరుగుతోంది. బీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతివ్వమని సీఎం జగన్‌ను కేసీఆర్‌ కోరే అవకాశం ఉంటుందని ఏపీతో పాటు తెలం గాణ లోని అధికార పార్టీ నేతలు చర్చించు కుం టున్నారు. రాజశ్యామల యాగం కార్యక్రమానికి హాజరవుతున్న ముఖ్యమం త్రులు అసలు అక్కడ రాజకీయం గురించి ప్రస్థావి స్తారా..? అటువంటి అంశాలు చర్చించుకుంటారా..? అసలు రాజకీయ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉం టుందా..? అన్న వాదన కూడా మరి కొంతమందిలో బలంగా వినిపిస్తోంది. అయితే యాగం అనంతరం కొంతసేపు అయినా ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకునే సందర్భం అయితే ఉంటుందని అటు తెలంగాణలోని బీఆర్‌ఎస్‌ వర్గాల్లోనూ, ఇటు ఏపీలోని వైసీపీ వర్గాల్లోనూ మరో వాదన వినిపిస్తోంది.

యాగం అనంతరం.. జగన్‌, కేసీఆర్‌లు కలుస్తారా..?
ఈ నెల 27 నుండి 31వ తేదీ వరకు విశాఖలోని శ్రీ శారదా పీఠంలో వార్షిక మహోత్సవాలు నిర్వహిసు ్తన్నారు. ఈ నేపధ్యంలో విశాఖ శ్రీ శారద పీఠం వార్షిక మహోత్సవ ఆహ్వాన పత్రికను శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మనందేంద్ర సరస్వతీ స్వామి స్వ యంగా తాడేపల్లికి వచ్చి సీఎం జగన్‌ను ఆహ్వానిం చారు. అదేవిధంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కూడా ఆహ్వానించారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా 28వ తేదీ జరిగే రాజశ్యామల యాగం చాలా ప్రాధాన్యత కలిగిందని, ఆ కార్యక్రమానికి రావాలని స్వామిజీ ఆహ్వానించారు. దీంతో ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శనివారం విశాఖకు వెళ్తు న్నారు. అక్కడి కార్యక్రమాలు పూర్తయ్యాక జగన్‌, కేసీఆర్‌లు కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మర్యాదపూర్వకంగా భేటీ అవుతారా..లేక ఆ సమా వేశంలో రాజకీయ అంశాలపై చర్చించుకునే అవకా శాలు ఉంటాయా.. అన్న అంశంపై రెండు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా వివిధ వర్గాల్లో చర్చ నడు స్తోంది. మర్యాదపూర్వకంగా భేటీలు సర్వ సాధా రణమే అయినప్పటికీ విశాఖ వేదికగా రాజకీయ అం శాలు ప్రస్థావనకు వస్తాయా.. ఒకవేళ వస్తే కేసీఆర్‌, జగన్‌ను మద్దతు కోరుతారా..? అన్న అంశంపై కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. ఇటీవల కేసీఆర్‌ ఖమ్మం లో భారీ బహిరంగ సభ నిర్వహించి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రాంతీ య పార్టీల అగ్రనేతలను ఆహ్వానించి బిఆర్‌ఎస్‌ పార్టీ సత్తాను చాటుకున్న విషయం తెలిసిందే. టీ ఆర్‌ఎస్‌ పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించి బీఆర్‌ఎస్‌ పార్టీగా నామకరణం చేశాక జగన్‌, కేసీఆర్‌లు కలవడం కూడా ఇదే తొలిసారి కావడంతో అన్ని వర్గాల్లోనూ వారి భేటీపై కొత్త చర్చ జరుగుతోంది.

బీజేపీకి జగన్‌ వ్యతిరేకమవుతారా..?
కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించాక దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ఆయా ప్రాంతాలకు చెం దిన అగ్రనేతలు, ముఖ్యమంత్రులతో భేటీ అయి పార్టీకి మద్దతివ్వాలని కోరుతూ వస్తున్నారు. ఈ నేపధ్యంలో ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిని కూడా మద్దతి వ్వమని అడిగే అవకాశాలు కనిపిస్తు న్నాయి. అదే జరిగితే జగన్‌ అందుకు అంగీ కరిస్తారా, బీజేపీకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటారా..? అసలు బీఆర్‌ఎస్‌ సహ కారం ఏపీలో అత్యంత బలంగా ఉన్న వైసీ పీకి అవసరం ఉంటుందా..? లేక భవిష్యత్తు రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచు కుని సీఎం జగన్‌ కేసీఆర్‌కు అనుకూలంగా నిర్ణయాన్ని ప్రకటిస్తారా..అంటే అంత అవ సరం తమ పార్టీకి లేదంటూ వైసీపీలోని కొంతమంది అగ్రనేతలు చెబుతున్నారు. మరి కొంతమంది నేతలు మాత్రం రాజకీయాల్లో ఎప్పుడేమి జరుగుతాయో చె ప్పలేమంటున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే వారి భేటీలో రాజకీయ అంశాలు చర్చకు వచ్చినా మద్దతిచ్చే విషయంలో స్పష్టత రాదని అర్ధమవుతుంది. గతంలో స్వయంగా సీఎం జగన్‌ కూడా తాము ఎవరితో పొత్తులు పెట్టుకోమని, తమ పొత్తులు ఎప్పటికైనా ప్రజలతోనే ఉంటాయని స్పష్టం చేశారు. ఇటీవల పలు సభల్లో కూడా సీఎం జగన్‌ ఇదే విషయాన్ని పదే పదే ప్రకటించారు. ఆ పార్టీలు పొత్తుల కోసం పాకులా డుతున్నాయని, రాష్ట్రంలో 151 సీట్లు సొంతం చేసుకుని వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలను గెలుచు కోవాలని లక్ష్యంగా ముందుకు సాగుతున్న వైసీపీ పొత్తు ప్రజలతోనే అని జగన్‌ చెబుతూ వస్తున్నారు. అదేవిధంగా ఇటీవల ప్రధాని నరేంద్రమోడీతో సీఎం జగన్‌ భేటీ అయిన సందర్భంలోనూ రాష్ట్రం నుంచి బీజేపీకి అండగా ఉంటామని జగన్‌ చెప్పడంతో పాటు ఆ దిశగా మోడీ కూడా వైసీపీ ప్రభుత్వానికి సహాయ స హకారాలు అందజేస్తామని భరోసానిచ్చారు. ఇటు వంటి పరిస్థితుల్లో సీఎం జగన్‌ బీఆర్‌ఎస్‌ వైపే మొగ్గు చూపుతారా.. అసలు విశాఖలో రాజకీయ అంశాలు చర్చకు వస్తాయా.. అనేది వేచి చూడాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement