Saturday, November 23, 2024

ప్ర‌ముఖ ర‌చ‌యిత‌.. జావేద్ అక్త‌ర్ జీవితంపై.. జాదూనామా పుస్త‌కం

ఢిల్లీలో జరుగుతున్న ఉర్దూ ఫెయిర్‌ ‘జష్న్‌-ఎ-రేఖ్తా’ లో ప్రముఖ రచయిత, సాహిత్యకారుడు జావెద్‌ అక్తర్‌ జీవితంపై ముద్రించిన జాదూనామా పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని రచయిత అరవింద్‌ మాండ్లోయ్‌ రచించారు. మంజుల్ పబ్లికేషన్స్‌ ముద్రించింది. దాదాపు 450 పేజీలున్న ఈ పుస్తకంలో జావెద్‌ అక్తర్‌కు సంబంధించి సాధారణ ప్రజానీకానికి తెలియని ఎన్నో అంశాలున్నాయి. పుస్తకాన్ని ఆవిష్కరించిన తర్వాత కవర్‌ పేజీ చూసి జావెద్‌ అక్తర్‌ ఆశ్చర్యపోయారు.

ఈ ఫొటో ఎక్కడ సంపాదించారు ఇన్ని విషయాలను ఎలా సేకరించారు.. నాపై కాకుండా మరో వ్యక్తిపై ఇంత కష్టం చేసి ఉంటే తప్పక మీకు పీహెచ్‌డీ వచ్చేది…అని జావెద్‌ అక్తర్‌ తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్లారు. కవర్‌ పేజీపై ఉన్న ఫొటో తన వద్ద కూడా లేదని ఆశ్చర్యపోయారు. జాదూనామా అనే టైటిల్‌కు సంబంధించి, జావేద్ సాహిబ్ ముద్దుపేరు జాదూ అని, అందుకే ఆయన జీవిత భాగాలను కవర్ చేసే పుస్తకానికి ‘జాదునామా’ అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు పుస్తక రచయిత అరవింద్‌ మాండ్లోయ్ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement