ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సత్తా చాటాడు. ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్ విభాగంలో ఏకంగా మొదటి స్థానానికి దూసుకెళ్లాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్‌ను వెనక్కి నెట్టి మరీ అగ్ర స్థానానికి ఎగబాకాడు. దీంతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో చాలా కాలం తరువాత ఓ భారత ఆల్ రౌండర్ అగ్ర స్థానానికి చేరుకున్నాడు. ఇంటర్నేనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ప్రపంచ నెంబర్ వన్‌గా అవతరించాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్‌ను వెనక్కి నెట్టి మరీ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మొదటి స్థానంలో ఉన్న రవీంద్ర జడేజా ఖాతాలో 406 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇక రెండో స్థానంలో ఉన్న హోల్డర్ ఖాతాలో 382 పాయింట్లు ఉన్నాయి.
శ్రీలంక టెస్టులో 175 పరుగులు..
ఇటీవల శ్రీలంకతో ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఆల్ రౌండర్‌గా రవీంద్ర జడేజా విశ్వరూపం చూపించాడు. దీంతో ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నెంబర్ వన్‌గా అవతరించాడు. ఈ టెస్టులో బ్యాటర్‌గా తొలి ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా 175 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఆ తరువాత బౌలింగ్‌లోనూ రవీంద్ర జడేజా దుమ్ము రేపాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టాడు. రెండు ఇన్నింగ్స్‌లో మొత్తం 9 వికెట్లతో మెరిశాడు. కాగా ఆల్ రౌండర్‌గా రవీంద్ర జడేజా చాలా కాలం నుంచి భారత్ క్రికెట్ జట్టులో నిలకడగా రాణిస్తున్నాడు. ఆల్ రౌండర్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్ సైతం సత్తా చాటాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు ఆల్ రౌండర్ జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ మూడో స్థానంలో నిలిచాడు. అతని ఖాతాలో 347 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. బౌలింగ్ జాబితాలో కూడా అశ్విన్ సత్తా చాటాడు. 850 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. కాగా ఇటీవల శ్రీలంకతో ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో అశ్విన్ బ్యాట్‌తో, బాల్‌తో రాణించాడు. బ్యాట్‌తో తొలి ఇన్నింగ్స్‌లో 61 పరుగులు చేసిన అశ్విన్, బౌలర్‌గా 5 వికెట్లు తీశాడు.
నాల్గో స్థానంలో హసన్..
ఆల్ రౌండర్ల జాబితాలో బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ (324 పాయింట్లు), ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ (287 పాయింట్లు) కూడా టాప్ 5లో నిలిచారు. షకీబ్ నాల్గో స్థానంలో, స్టోక్స్ ఐదో స్థానంలో నిలిచారు. ఆ తరువాత ఆరో స్థానంలో మిచెల్ స్టార్క్ (284 పాయింట్లు), ఏడో స్థానంలో కైల్ జేమీషన్ (274 పాయింట్లు), ఎనిమిదో స్థానంలో గ్రాండ్ హోం (245 పాయింట్లు), తొమ్మిదో స్థానంలో పాట్ కమిన్స్ (243 పాయింట్లు), పదో స్థానంలో క్రిస్ వోక్స్ (232 పాయింట్లు) ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..