రవీంద్ర జడేజా ఆల్‌రౌండర్ గా మంచి ఫామ్ లో ఉన్నాడు. శ్రీలంక వర్సెస్ ఇండియా టెస్టులో భారీ స్కోరు సాధించాడు. అలాగే వికెట్లు కూడా తీశాడు. ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్‌ను విడుదల చేయడంతో అందులో టీమ్ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అగ్రస్థానంలో నిలిచాడు. శ్రీలంకతో జరిగిన భారత్ మొదటి టెస్టు అద్భుతమైన ఇన్నింగ్స్ చేశాడు జడేజా. ఈ టెస్టు మ్యాచ్‌లో 175 పరుగులు సాధించిన జడ్డూ.. 9 వికెట్లను పడగొట్టాడు. ఈ మేరకు జడేజా ఈ ఘనత దక్కించుకున్నాడు. టెస్టుల్లో జడేజా దే అత్యధిక స్కోరు. ఏడో స్థానంలో ఓ భారత బ్యాట్స్‌మన్ సాధించిన అత్యధిక పరుగులు కూడా ఇవే. కపిల్ దేవ్ 1986లో శ్రీలంకపైనే 163 పరుగులతో నెలకొల్పిన రికార్డును అతను బద్దలు కొట్టాడు.”ఇటీవల మొహాలీలో శ్రీలంకతో జరిగిన టెస్టులో భారత్ విజయం సాధించిన తర్వాత రవీంద్ర జడేజా ఐసీసీ పురుషుల టెస్ట్ ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానానికి చేరుకున్నాడు” అని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital