Friday, November 22, 2024

తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ నిర్ణ‌యం.. 16న సీఎం కేసీఆర్‌కు ధన్యవాద సభ

హైదరాబాద్‌, ప్రభన్యూస్‌: ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు, అమరవీరుల స్మారక చిహ్నం ఏర్పాటు చేయడం తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్‌ పేరు పెట్టడాన్ని పురస్కరించుకొని ఈ నెల 16న సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ప్రజాసంఘాల జెఎసి ఛైర్మన్‌ గజ్జెల కాంతం ఆధ్వర్యంలో ధన్యవాద సభ నిర్వహిస్తున్నామని, ఈ సందర్బంగా గన్‌ పార్క్‌ వద్ద తెలంగాణ ప్రజా సంఘాలు జేఏసి ఆధ్వర్యంలో పోస్టర్‌ విడుదల చేశారు తెలంగాణ ప్రజా సంఘాల జేఏసి చైర్మన్‌ గజ్జెల కాంతం.

కాగా దీనిని ఓర్వలేని వారు కొంత మంది ఉన్నారని అందులో ముఖ్యంగా బీజేపీ పార్టీ వారు తట్టుకోలేక పోతున్నారని, సీఎం కేసీఆర్‌ అంటే వారికీ భయం పట్టుకుందని, రానున్న రోజులలో తెలంగాణ లో జరిగినటు-వంటి అభివృద్ధి దేశం అంతటా జరుగుతుందని, నాడు బీజేపీ ఉండదనే అనే భయం వారికి పట్టు-కుందన్నారు. నరేంద్ర మోడీ నోరు తెరిస్తే అన్నీ అబద్దాలే అని, హింధువు అని పేరు చెప్పుకుంటున్నారు, కానీ హిందూ యువతకు 2కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఇచ్చారా? నల్లధనం తీసుకొని వస్తామన్నారు తీసుకొని వచ్చారా? బీజేపీ ఎంపీ వేదిస్తున్నారు అని మహిళక్రీడాకారిణిలు ధర్నా చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు? జంతర్‌ మంతర్‌ వద్ద మహిళలు ధర్నా చేస్తే పోలీసుల చేత హింసించారు, తీవ్రవాదుల కన్నా, ఉగ్రవాదుల కన్నా అత్యంత ప్రమాదకరమైన వాళ్ళు ఉన్నారు అంటే ఆర్‌ ఎస్‌ ఎస్‌, బీజేపీ, వీరిద్దరిని దేశం నుంచి తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వగజ్జెల కాంతం అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement