కోవిడ్ కారణంగా తాను ఒప్పుకున్న కొన్ని షోలు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు సింగర్ మనో. ఇళయరాజా, ఏ ఆర్ రెహమాన్ తో కొన్ని షోలు చేయాల్సి ఉంది. ముందుగా ఒప్పుకున్న ఈవెంట్స్, పెండింగ్ లో ఉన్న షోలను పూర్తి చేయడానికే జబర్దస్త్ కి గ్యాప్ ఇచ్చాను. అంతకు మించిన కారణం ఏమీ లేదని సింగర్ మనో వివరణ ఇచ్చారు. నటుడు నాగబాబు జబర్థస్త్ కి గుడ్ బై చెప్పాక ఆయన స్థానంలోకి ఎవరి తేవాలనే చర్చ నడిచింది. యాక్టర్ అలీతో పాటు పలువురు జబర్దస్త్ జడ్జెస్ గా వ్యవహరించారు. సింగర్ మనో పర్మినెంట్ గా సెటిల్ అయ్యారు. మనో టైమింగ్, కామెడీ పంచెస్ నచ్చడంతో మల్లెమాల ఆయన్ని ఎంచుకోవడం జరిగింది. చాలా కాలం సింగర్ మనో, రోజా జబర్దస్త్ జడ్జెస్ గా చేశారు.
రోజాను మంత్రి పదవి వరించడంతో ఆమె జబర్దస్త్ కి గుడ్ బై చెప్పారు. నిబంధనల రీత్యా మంత్రి పదవిలో ఉన్నవారు ఇతర వృత్తుల్లో కొనసాగకూడదు. అలాగే ప్రజాప్రతినిధిగా మంత్రి హోదాలో ఆమె బాధ్యతలు మరింత పెరిగాయి. దీంతో జబర్దస్త్ వదిలేసి వెళ్లిపోయారు. పలువురు ఆమె ప్లేస్ లోకి వచ్చారు. ఇంద్రజ అందరికంటే మెప్పించి సెటిల్ అయ్యారు. సింగర్ మనో-ఇంద్రజ చాలా ఎపిసోడ్స్ లో జడ్జెస్ గా కనిపించారు. మెల్లగా సింగర్ మనో కూడా దూరమయ్యాడు. సింగర్ మను జబర్దస్త్ ఎందుకు మానేశారనే చర్చ నడిచింది. మల్లెమాలతో ఆయనకు విభేదాలు తలెత్తాయి. అందుకే షో నుండి వెళ్లిపోయాడంటూ కథనాలు వినిపించాయి. తాజాగా ఈ వార్తలకు ఆయన స్పష్టత ఇచ్చారు.