కెరీర్ లోనే తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్నశ్రేయస్ అయ్యర్.. ఫస్ట్ ఇన్నింగ్స్ లోనే సెంచరీతో రికార్డ్ సృస్టించాడు.. ఇక కాన్పూర్ లో జరుగుతున్న సెకండ్ ఇన్నింగ్స్ లో 51 రన్స్ కే 5 వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియాకు 65 పరుగులు అందించి తొలి టెస్ట్ లోనే తనదైన శైలిలొ ప్రతిభను చాటుకున్నాడు అయ్యర్.
అశ్విన్ (32), వృద్ధిమాన్ సాహా (22 బ్యాటింగ్) అందించడంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో కుప్పకూలే ప్రమాదం నుంచి గట్టెక్కింది. ఇక అయ్యర్ 65 పరుగులు సాదించి సౌథీ బౌలింగ్ లో అవుటయ్యాడు. టీ విరామ సమయానికి టీమిండియా రెండో ఇన్నింగ్స్ స్కోరు 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 216 పరుగులకు చేరింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital