Tuesday, November 26, 2024

బయట ఎండల వెూత.. ఇంట్లో ఉక్కపోత.. శీతల పానీయాల వైపు ప్రజలు పరుగులు

అడ్డాకుల (ప్రభన్యూస్‌): ఎండలు తీవ్రంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బయటికి వెళితే ఎండల మోత.. ఇంట్లో ఉంటే ఉక్క పోత అన్నట్లు మారింది, దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతూ నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్ల్లలు, వృద్ధులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ వైపు కరెంటు కోత మరోవైపు ఎండల తీవ్రత ఉండటంతో ప్రజల అవస్థలు వర్ణనాతీరం ఎండల తీవ్రత ఉండటంతో సేద తీర్చేందుకు శీతల పానీయాల వైపు ప్రజలు పరుగులు పెడుతున్నారు. ఇదే అదునుగా చేసుకుని వ్యాపారస్తులు శీతల పానీయాలను అధిక ధరలకు విక్రయిస్తూ ప్రజల డబ్బులు దండుకుంటున్నారు.

మామూలు సమయాల్లో ఒక కొబ్బరి బోండా 25 రూపా యలు 30 రూపాయలు ఉండగా ప్రస్తుతం కొబ్బరిబోండా 50-60 రూపాయలకు పెరిగిపోయింది. దీంతో సామాన్య జనం కొనలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటికి తోడు విద్యుత్‌ సరఫరా కోత విధించడంతో చిన్నపిల్లలు వృద్ధలు , గర్బిణీలకు అవస్థలు తప్పడం లేదు, వాతావరణ శాస్త్రవేత్తలతో పాటు తెలంగాణ రాష్ట్ట్ర ప్రభుత్వం వైద్య అధికారులు సౖౖెతం ఎండలు తీవ్రత ఎక్కువగా ఉందని బయటికి వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. బయటికి వెళితే ఉదయం 11 గంటల వరకు వెళ్లాలని అనంతరం బయటికి వెళ్లకూడదని వేడి గాలులు వల్ల ఎండలు తీవ్రతతో వడ దెబ్బ తగిలే అవకాశం ఉంటుందని పదే పదే చెబుతుండటంతో ప్రజలు భయాం దోళనలకు గురవుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement