ఇట్లు మారేడు మిల్లి నియోజకవర్గం చిత్రం నుండి ప్రీ టీజర్స్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. హీరో అల్లరి నరేష్ నటిస్తోన్న తాజా చిత్రం ఇది . ఏ.ఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడీయోస్, హాస్య మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. శ్రీదేవి సోడా సెంటర్’ ఫేం ఆనంది ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రామ్ రెడ్డి ఛాయగ్రహకుడిగా పనిచేస్తున్నారు. అబ్బూరి రవి మాటలు అందిస్తున్నారు.
ఈటీజర్లో షూటింగ్‌కు సంబంధించిన లోకేషన్లను చూపిస్తూ 55రోజుల షూటింగ్లో ప్రతి లోకేషన్‌కు చేరుకోవడానికి దాదాపు నాలుగు గంటల సమయం పట్టేదని టీజర్లో చూపించారు. వంజంగీ హిల్స్‌కు ఉదయం 3 గంటల నుండి 6 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా 22 అన్ఎక్స్ప్లోరుడ్ లోకేషన్లలో 250మంది యూనిట్ సభ్యులతో షూటింగ్ జరిపినట్లు ప్రీ టీజర్లో చూపించారు. టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి మేకర్స్ పెట్టిన ఎఫర్ట్స్ కళ్ళకట్టినట్లు కనిపిస్తున్నాయి. ఈ ప్రీ టీజర్‌తో చిత్రబృందం సినిమాపై అంచనాలను పెంచింది.ఈ చిత్రంలో అల్లరినరేష్ ఎలక్షన్ అధికారిగా కనిపించనున్నారు.