ఐటీఐ కన్జరేటివ్ హైబ్రిడ్ ఫండ్‌ను విడుదల చేసినట్టు ఐటీఐ మ్యూచువల్ పండ్ వెల్లడించింది. ఈ ఎన్‌ఎఫ్‌్‌ఓ ఫిబ్రవరి 21, 2022న తెరుస్తున్నట్టు వివరించింది. మార్చి 07, 2022న మూసివేయడం జరుగుతుందని తెలిపింది. ఈ ఫండ్ ప్రధానంగా అత్యంత నాణ్యమైన డెబ్ట్ ఇన్‌స్ట్రుమెంట్స్, సుప్రసిద్ధ నిఫ్టీ 50 ఇండెక్స్ స్టాక్స్‌లో పెట్టుబడులు పెడుతుంది. ఈ ఫండ్‌ను విక్రాంత్ మెహతా, ప్రదీప్ గోఖలే నిర్వహించనున్నారు. ఈ ఎన్‌ఎఫ్‌ఓ విడుదల సందర్భంగా ఐటీఐ మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, చీఫ్ ఇనెస్ట్‌మెంట్ ఆఫీసర్ జార్జ్ హెబర్ జోసెఫ్ మాట్లాడుతూ. మదుపరులకు ఐటీఐ కన్జరేటివ్ హైబ్రిడ్ ఫండ్‌ను అందిస్తుండటం పట్ల చాలా సంతోషంగా ఉందన్నారు. సంప్రదాయ పొదుపు పథకాలలో పెట్టుబడులు పెట్టే మదుపరులను ఇది ఎంతో ఆకర్శిస్తుందని విశ్వసిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ ఫండ్‌లో కనీసం 75 శాతం మొత్తాలను అత్యంత నాణ్యమైన డెబ్ట్ సెక్యూరిటీలలో పెట్టుబడులు పెడితే.. మిగిలిన మొత్తాలను ఈకిటీ, ఈక్విటీ సంబంధిత ఇన్‌స్ట్రుమెంట్స్‌లో పెట్టుబడి పెట్టనున్నట్టు తెలిపారు.
ఐటీఐ.. 16వ ఫండ్..
ఐటీఐ ఏఎంసీ తమ రెండు సంవత్సరాల కాలంలో విడుదల చేసిన 16వ ఫండ్ ఇది. జనవరి 31, 2022 నాటికి ఇది రూ.2,661కోట్ల ఆస్తులను నిర్వహిస్తోంది. దీనిలో ఈక్విటీ ఏయూఎం రూ.1869 కోట్లు కాగా.. హైబ్రిడ్, డెబ్ట్ పథకాల వాటా వరుసగా రూ.580 కోట్లు, రూ.212 కోట్లుగా ఉన్నాయి. ఏయూఎం భౌగోళిక విస్తరణలో.. 38.25 శాతం టాప్ 5 నగరాలు.. 23,70 శాతం వాటాతో ఆ తరువాత 10 నగరాలు ఉన్నాయి. తదుపరి 20 నగరాలు 18.18 శాతం వాటా, ఆ తరువాతి 75 నగరాలు 15.15 శాతం వాటాను, మిగిలిన నగరాలు 4.72 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఐఐటీ మ్యూచువల్ ఫండ్ అనేది.. ది ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఫార్చ్యూన్ క్రెడిట్ క్యాపిటల్ లిమిటెడ్ ద్వారా స్పాన్సర్ చేయబడిన డైనమిక్, ఇన్నోవేటివ్ ఫండ్ హౌస్.
2019లోనే ప్రారంభం..
ఐఐటీ మ్యూచువల్ ఫండ్ తన కార్యకలాపాలను ఏప్రిల్ 2019లో ప్రారంభించింది. పెట్టుబడిదారుల కోసం మార్కెట్‌లో 15 ప్రధాన మ్యూచువల్ ఫండ్‌లను ప్రారంభించింది. ఏఎంసీకి పెద్ద సాంప్రదాయిక నగదు అధికంగా ఉండే వ్యాపార సమూహం మద్దు ఇస్తుంది. ఇంత తక్కువ వ్యవధిలో పెట్టుబడిదారులకు సున్నితమైన దీర్ఘ కాలిక పెట్టుబడి అనుభవాన్ని సృష్టించేందుకు ఏఎంసీలో పాలన, వ్యక్తులు, ప్రక్రియలు, మౌలిక సదుపాయాలు బాగా స్థిరపడినట్టు గ్రూప్ నిర్ధారిస్తుంది. ఐఐటీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్, ఈక్విటీ రీసెర్చ్, క్రెడిట్ రీసెర్చ్ స్పేస్‌లో అత్యుత్తమ ఆలోచనలతో ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..