Friday, November 22, 2024

భారతీయ ప్రయాణికులపై ఇటలీ, నెదర్లాండ్స్‌ నిషేధం..

భారత్ లో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఒక్క రోజు లో ఎన్ని కేసులు రావడం లేదు. ఇవాళ ఒక్కరోజే దేశవ్యాప్తంగా మూడు లక్షల 50 వేల కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో ప్రపంచ దేశాల దృష్టిలో భారత్ ఇప్పుడు రెడ్ జోన్ గా మారింది. దీంతో భారత్ నుంచి వచ్చే ప్రయాణికులప పలు దేశాలు నిషేధాజ్ఞలు విధిస్తున్నాయి. రెండు రోజులక్రితం సింగపూర్‌, న్యూజిలాండ్‌, కెనడా దేశాలు భారత్‌ నుంచి విమానాలపై ఆంక్షలు విధించాయి. భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధిస్తున్న దేశాల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. 

తాజాగా ఈ జాబితాలో ఇటలీ, నెదర్లాండ్స్‌ చేరాయి. గత 14 రోజులుగా ఇండియాలో ఉన్న విదేశీయులు ఇటలీకి రాకుండా నిషేధం విధించే ఫైలుపై సంతకం చేసినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి రొబెర్టో స్పెరాన్జా ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. అయితే ఇటలీకి చెందినవారు భారత్‌ నుంచి తిరిగి స్వదేశానికి రావచ్చని, అయితే నెగెటెవ్‌ రిపోర్టు తప్పనిసరని వెల్లడించారు. అలా వచ్చినవారు కూడా క్వారంటైన్‌కు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటికే ఇటలీకి వచ్చినవారు 14 రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement