ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తన భాగస్వామి అయిన ఆండ్రియా గియాంబ్రూనోతో విడిపోయినట్లు ఇవ్వాల (శుక్రవారం) సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ దంపతులకు ఏడేళ్ల కుమార్తె ఉంది. ‘ఆండ్రియా జియాంబ్రూనోతో దాదాపు 10 సంవత్సరాల పాటు కొనసాగిన నా రిలేషన్ ఇవ్వాల ముగిసింది” అని ప్రధాని మెలోని తన సోషల్ మీడియా అకౌంట్లో తెలిపారు.
ఆండ్రియా గియాంబ్రూనో ప్రముఖ టీవీ ఛానెల్ లో వ్యాఖ్యాతగా పని చేస్తున్నారు. అయితే రీసెంట్ గా టెలీకాస్ట్ అయిన ప్రోగ్రామ్ లో ఆండ్రియా గియాంబ్రూనో అసభ్యకరమైన భాషను ఉపయోగించడం.. ఒక మహిళా సహోద్యోగిపై సెక్సిస్ట్ వ్యాఖ్యలు చేసినందుకు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ ఎపిసోడ్ తర్వాత మెలోని తన భాగస్వామి చేసిన వ్యాఖ్యలకు తనను విమర్శించవద్దని.. అలాగే, అతని ప్రవర్తన గురించిన తనను అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వబోనని చెప్పింది.