Friday, November 22, 2024

స‌మాజ్ వాదీ నేత రాజీవ్ రాయ్ ఇంట్లో ఐటీ సోదాలు

ఆదాయ‌ప‌న్ను శాఖ అధిరారులు ఎస్పీ నేత అఖిలేశ్ యాద‌వ్ తో లింకు ఉన్న ప‌లువురి ఇళ్లల్లోనూ త‌నిఖీలు చేస్తున్నారు. అందులో భాగంగానే సమాజ్‌వాదీ పార్టీ నేత రాజీవ్ రాయ్ ఇంట్లో ఐటీ అధికారులు ఈరోజు సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఆర్‌సీఎల్ గ్రూపు ప్ర‌మోట‌ర్ మ‌నోజ్ యాద‌వ్‌కు చెందిన ప్రాంతాల్లో త‌నిఖీలు చేస్తోంది. మెయిన్‌పురిలోని ఆయ‌న ఇంట్లో కూడా సోదాలు జ‌రుగుతున్నాయి. దీనిపై రాజీవ్ రాయ్ త‌న‌కు ఎటువంటి నేర‌చ‌రిత్ర లేద‌ని, త‌న వ‌ద్ద న‌ల్లధ‌నం కూడా లేద‌ని అన్నారు. యూపీలోని ఇత‌ర ప్రాంతాల్లోనూ ఐటీశాఖ సోదాలు చేస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement