హైదరాబాద్ – ప్రముఖ నిర్మాత దిల్ రాజు కు చెందిన ఎస్‌వీసీ , మైత్రి మూవీ మేకర్స్ , మ్యాంగో మీడియా సంస్థలలో రెండో రోజు కూడా ఐటీ అధికారుల సోదాలు జరగుతున్నాయి.
సినిమాలకు పెట్టిన బడ్జెట్‌పై ఐటీ అధికారులు ఆయా సంస్థల అధినేతలను వరుసగా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా పుష్ప-2 మూవీ బడ్జెట్, వరల్డ్ వైడ్‌గా వచ్చిన కలెక్షన్లపై వివరాలు సేకరిస్తున్నారు.
కాగా, మంగళవారం 8 చోట్ల ఏక కాలంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. నిర్మాత దిల్ రాజు భార్య తేజస్విని ని బ్యాంకు వివరాలు చూపించాలని ఐటీ అధికారులు కోరారు. అనంతరం ఆమెను నేరుగా బ్యాంకుకు తీసుకెళ్లి ఆమె పేరుపై ఉన్న లాకర్లను ఓపెన్ చేసి చెక్ చేశారు.