Tuesday, November 26, 2024

రేపు బీహార్ లో విప‌క్షాల భేటి – ఐటి, ఈడీ దాడులను తీవ్ర‌త‌రం చేసిన కేంద్రం

పాట్నా – బీహార్ లోని పాట్నాలో ప్రతిపక్ష పార్టీల సమావేశం ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో రేపు జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశానికి విప‌క్షాల‌కు చెందిన 27పార్టీల నేత‌ల‌ను ఆహ్వానించారు.. వ‌చ్చే ఎన్నిక‌ల‌లో మోడీ ప్ర‌భుత్వాన్ని సాగ‌నంపేందుకు వ్యూహం రచించేందుకు ఈ స‌మావేశం ఏర్పాటు చేశారు.. ఈ నేప‌థ్యంలోనే కేంద్రం విప‌క్ష నేత‌ల సన్నిహితుల ఇళ్లు, కార్యాల‌యాల‌పై ఐటి, ఈడ దాడుల‌ను ముమ్మ‌రం చేసింది..

బిహార్‌ బెసగురాయ్‌లో నితీశ్‌ దగ్గరి మంత్రి విజయ్‌కుమార్‌ చౌదరికి సన్నిహితుడైన పారిశ్రామికవేత్త అజయ్ కుమార్ సింగ్ అలియాస్ కరోన్ సింగ్ ఇంటిపై దాడులు జరిగాయి. నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విశ్వనాథ్ నగర్ ప్రాంతంలో దాడులు జరుగడంతో ఈ ప్రాంతంలో కలకలం సృష్టించింది. ఉదయం 6 గంటల సమయంలో ఈడీ, ఆదాయపు పన్నుశాఖ అధికారులు వచ్చారని స్థానికులు పేర్కొన్నారు. మంత్రి విజయ్‌ చౌదరి బావమరిది నివాసంపై ఈడీ, ఐటీ అధికారులు దాడి చేశారని, జేడీయూ జాతీయ అధ్యక్షుడు లాలన్ సింగ్‌కు ఆయన సన్నిహితుడని స్థానికులు పేర్కొన్నారు. ఈడీ, ఆదాయపన్ను శాఖల బృందం ఏడు వాహనాల్లో వచ్చారని, దాంతో మరో రహస్య స్థావరంపై సైతం దాడులు చేసినట్లు సమాచారం. రాడ్ల గోడౌన్‌లోనూ దాడులు జరుగుతున్నాయి. అలాగే బీహార్ లోని పలు ప్రాంతాల‌లో నితీష్ స‌న్నిహితుల కార్యాల‌యాల‌లో ఈడీ సోదాలు జ‌రుగుతున్న ట్లు స‌మ‌చారం.. ఈ దాడుల‌ను నితీష్ ఖండించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement