దేశంలోని పలు చైనీస్ మొబైల్ కంపెనీలపై ఆదాయపన్ను శాఖ ఇప్పటికే నిఘా పెట్టగా… ఇవాళ సోదాలు నిర్వహిస్తోంది. ఉదయం 9 గంటల నుంచి ఐటీశాఖ ఆధ్వర్యంలో పలు బృందాలు దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నాయి. పన్నులను ఎగవేసేందుకు ఆయా కంపెనీలు రూల్స్‌ను ఉల్లంఘిస్తున్నట్లు ఐటీ శాఖ గుర్తించింది. తయారీ సంస్థలతో పాటు పలు కార్పొరేట్ సంస్థలపై దాడులు జరుగుతున్నట్లు ఓ అధికారి తెలిపారు. చైనీస్ మొబైల్ కంపెనీలకు చెందిన గోడౌన్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అక్కడ నుంచి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. గురుగ్రామ్‌లో టెలికాం ఉత్పత్తులను తయారీ చేసే జెడ్‌టీఈ సంస్థ ఆఫీసుల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.అయితే గతంలో చైనా సంస్థలు నిర్వహిస్తున్న మొబైల్ లోన్ అప్లికేషన్, ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారాలపై పలు ఏజెన్సీలు దాడులు చేసిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital