ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు నివాసంలో నాలుగో రోజూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే దిల్ రాజు ఇంటికి మరోసారి ఐటీ అధికారులు వచ్చారు. మహిళా అధికారి ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు దిల్ రాజు సోదరుడి ఇంట్లో సోదాలు ముగిశాయి.
ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలించారు. గురువారం జరిగిన సోదాల్లో దిల్ రాజు నివాసంలో 21 మంది అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం దిల్ రాజును సాగర్ సొసైటీలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయానికి అధికారులు తీసుకెళ్లారు.
- Advertisement -