పోలింగ్ కేంద్రంలో ఓటరు ఓటుహక్కును వినియోగించుకునే క్రమంలో ఫోన్‌లో సెల్ఫీలు తీసుకోవటం.. ఇతరులకు చూపడం నిషేధం. ఎవరైనా అలా చేస్తే 49ఎం నిబంధన ప్రకారం (ఓటు రహస్యం) ఓటును బహిర్గతపర్చిన ఓటరును అధికారులు బయటకు పంపిస్తారు.
ఎన్నికల నిబంధన 17ఎ లో ఆ ఓటును నమోదు చేస్తారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆ ఓటును పరిగణనలోకి తీసుకోరు. అంటే ఆ ఓటు నిరుపయోగమవుతుంది. నిబంధన 49ఎన్ ప్రకారం అంధులైన ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు 18 ఏళ్లు దాటిన సహాయకుడిని వెంట తీసుకెళ్లవచ్చు. అయితే సదరు సహాయకుడు అంధుడి ఓటును బహిర్గతపర్చనని నిబంధన 10లో ధ్రువీకరించాల్సి ఉంటుంది.