సోదాల పేరుతో మహిళా నేతలు ఉన్న గదుల్లోకి పోలీసులు ప్రవేశించడం సరికాదని ఏఐసీసీ అగ్రనాయకురాలు, వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరికొద్ది రోజుల్లో కేరళలోని వాయనాడ్, పాలక్కడ్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.
దీంతో పలువురు కాంగ్రెస్ మహిళా నేతలు పాలక్కాడ్‌లోని ఓ హోటల్‌లో బస చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ కాంగ్రెస్ కార్యకర్త బ్యాగ్‌తో హోటర్ లోపలికి వెళ్లారు. అయితే నల్లధనం తీసుకెళ్తున్నారనే అనుమానాలు రావడంతో కేరళ ప్రభుత్వం విచారణ చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ క్రమంలో పోలీసులు హోటల్‌కు వెళ్లి సోదాలు చేశారు. ఈ ఘటనపై స్పందించిన ప్రియాంక గాంధీ… ఆగ్రహం వ్యక్తం చేసింది. సోదాల పేరుతో అర్ధరాత్రి సమయంలో మహిళలు ఉన్న గదుల్లోకి పోలీసులు వెళ్లడం తప్పు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.