కరీంనగర్ : జిల్లా కేంద్రాల్లో ఐటీ టవర్ నిర్మించినా అనుకున్న మేరకు సాఫ్ట్వేర్ కంపెనీలు ఎందుకు రావడంలో అధ్యయనం చేసి ప్రోత్సహించేందుకు తగుచర్యలు తీసుకుంటామని ఐటీ పరిశ్రమల శాఖమంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు.ఐటీ టవర్లు నిర్మించినంత మాత్రాన ఐటీ వృద్ది జరగదని..వాటిని బలోపేతం చేసేందుకు యత్నిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఐటీ రంగం హైదరాబాద్,తో పాటు జిల్లా కేంద్రాలకు మాత్రమే పరిమితం కాకూడదని త్రీటయర్ పట్టణాలకు కూడా విస్తరించి అక్కడ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
భాజపా భారాసలు తమ ఉనికి కాపాడుకోవడానికే ఆరాటపడుతున్నాయని.. పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.హైదరాబాద్ నుంచి ధర్మపురి వెళ్తున్నక్రమంలో కరీంనగర్లో కొంతసేపు ఆగి మీడియాతో మాట్లాడారు. నిన్న కేవలం మేనిఫెస్టో ఇచ్చిన హామీలు ఏమేరకు అమలు అవుతున్నాయి…రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మాత్రమే సమీక్ష జరిగిందన్నారు.గత ప్రభుత్వాలు అమలు చేసిన పథకాల్లో మంచి విషయాలను తప్పకుండా పరిగణలోకి తీసుకుంటామన్నారు.
మేడిగడ్డ నాణ్యత ప్రమాణాల విషయంలో ప్రజలకు వాస్తవాలు తెలియడమే కాకుండా దానికి సంబంధించిన నివేదికను కూడా ప్రభుత్వం రూపొందిస్తుందని అన్నారు. కరీంనగర్లో ఐటీ కరీంనగర్ ను బలోపేతం చేసేందుకు హెచ్ సి ఎల్ లాంటి పెద్ద సంస్థలను ఆహ్వానిస్తున్నామని అన్నారు.రాష్ట్రం లో ఉన్నది ప్రజా ప్రభుత్వం.. ఎవరో కూలగొడితే కూలిపోయే ప్రభుత్వం కాదు..ప్రజలు మాకు ఎన్నిరోజులు అవకాశమిస్తే అన్ని రోజులు అధికారం లో ఉంటామన్నారు.గత ప్రభుత్వాలు చేసిన మంచిని కొనసాగిస్తాం…దావోస్ లో వచ్చిన పెట్టుబడులపై బిఆర్ఎస్ వ్యాఖ్యలు అర్థరహితమని శ్రీధర్‌బాబు విమర్శించారు.
ప్రజా శ్రేయస్సు కోసం ,రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వాలు కొన్ని పనులను కొనసాగిస్తుంటాయి.. అలాగని ఆ పని మేమే చేశామని బిఆర్ఎస్ చెప్పుకుంటే అవివేకమౌతుందని శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. బైపాస్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వాగతం పలికారు.నాయకులు కార్యకర్తలు అభిమానులు శాలువాలు పూలమాలలతో శ్రీధర్ బాబును సత్కరించారు.