హీరో మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేణ్ కి సొంతభవనాన్ని కటిస్తామనే ఎజెండాతో మా అధ్యక్ష పదవికి ఎన్నికల బరిలోకి దిగి విజయాన్ని సాధించారు. తనని అధ్యక్షుడిగా గెలిపిస్తే సొంత డబ్బుతో ‘మా ‘భవనాన్ని నిర్మిస్తానని…ఒక్క పైసా కూడా అసోసియేషన్ నుంచి తీసుకోకుండా అన్ని తానై ముందు నిలబడి ఆ పని పూర్తి చేస్తానని వాగ్దానం చేసారు. వీలైనంత త్వరగా భవనం ఏర్పాటు చేసి తన బాధ్యత నెరవేస్తానని ప్రామిస్ చేసారు. అయితే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధ్యక్షుడు మంచు విష్ణు చేసిన వ్యాఖ్యల్ని బట్టి మా భవనాన్ని నిర్మించడం ఇప్పట్లో సాధ్యం కాదని గుసగుసలు మొదలయ్యాయి. ఇప్పుడున్న ఛాంబర్ కి 20 నిమిషాల ప్రయాణ దూరంలో విష్ణు ఓ కొత్త భవనం చూసారట. కానీ సభ్యులు అంత దూరం వెళ్లడం కన్నా ఛాంబర్ కూల్చివేత తర్వాత కొత్త భవనం ఇక్కడే ఏర్పాటు చేసుకుందామని అనడంతో విష్ణు వాళ్ల మాటకే కట్టుబడి నట్లు తెలిపారు.అయితే ఇది జరగడానికి కనీసం మూడు..నాలుగేళ్లు సమయం పడుతుందని అన్నారు. ఆ కార్యాలయానికి ఎన్ని కోట్లు ఖర్చు అయినా తానే భరిస్తానని మరోసారి విష్ణు మాటిచ్చారు. ఎన్నికలకు ముందు చెప్పినవన్నీ పూర్తిచేసానని ..భవనం ఒక్కటే పెండింగ్ ఉందన్నారు.
అలాగే 20 నిమిషాల దూరంలో భవనం ఉందని చెప్పారు తప్ప.. అది సొంత భవనమా.. అద్దెకు తీసుకున్నారా అన్నది క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ సొంత భవనమే అయితే 20 నిమిషాల జర్నీ కూడా చేయలేని పరిస్థితుల్లో ఆర్టిస్టులు ఉన్నారా అన్నది మరో సందేహంగా తెరపైకి వస్తోంది. ఆ రకంగా ‘మా’ సొంత భవనం ఇప్పట్లో తేలేది కాదని…విష్ణు వ్యాఖ్యలు సాధారణ నాయకుడి మాటల్ని తలపిస్తున్నాయని ఆయన వ్యతిరేక వర్గం అభిప్రాయపడుతుంది. గెలవడం కోసమే సొంత భవనం ఎర వేసి గెలిచాడని ఎద్దేవా చేస్తున్నారు. అలాగే ‘మా’ లో ప్రక్షాళన కూడా విడ్డూరంగానే ఉందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొత్త నిబంధనలతో సభ్యులకు ఇబ్బందులు తప్పవని విమర్శలొస్తున్నాయి.