ప్రభన్యూస్: లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ (పోక్సో) చట్టం కింద పరిగణించబడే నేరానికి స్కిన్ టు స్కిన్ (నేరుగా శరీరాన్ని తాకడం) కాంటాక్ట్ అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బాలిక శరీరాన్ని నిందితుడు నేరుగా తాకనప్పుడు, ఆ చర్య పోక్సో చట్ట నిబంధనల ప్రకారం లైంగిక వేధింపుల కిందకు రాదన్న బాంబే హైకోర్టు తీర్పును కొట్టివేసింది. దుస్తుల మీద నుంచి శరీర భాగాలను తాకడం లైంగిక వేధింపేనని గురువారం నాటి తీర్పులో స్పష్టం చేసింది.
చట్టానికి సంకుచిత వివరణ ఇచ్చేలా బాంబేహైకోర్టు తీర్పు ఉందని వ్యాఖ్యానించింది. లైంగిక వేధింపుల నుంచి పిల్లలను రక్షించడమే పోక్సో చట్టం లక్ష్యమన్న సర్వోన్నత న్యాయస్థానం, లైంగిక ఉద్దేశంతో చేసే శారీరక స్పర్శ లేదా సంబంధం నేరమేనని తెలిపింది. లైంగిక దాడి చేయాలన్న ఉద్దేశంతో బాలికను తాకినప్పుడు అది నేరం కిందే లెక్క. ఈ కేసులో నిందితుడిని నిర్దోషిగా పేర్కొంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..