Thursday, October 24, 2024

TG | ఉద్యోగానికి, ప‌నికి సంబంధం లేదు.. రోడ్డెక్కిన కానిస్టేబుళ్ల భార్యలు

  • జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా
  • రక్షకభటులుగా గుర్తించాలని డిమాండ్


సిరిసిల్ల, ఆంధ్ర ప్ర‌భ‌ : తమ భర్తలను కూలీలుగా మార్చి వెట్టి చాకిరి చేయిస్తున్నారని 17వ బెటాలియన్ పోలీసుల కానిస్టేబుళ్ల‌ భార్యలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ‌ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వారి భర్తల సమస్యలు పరిష్కరించి, న్యాయం చేయాలంటూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పోలీసు ఉద్యోగానికి తమ భర్తలు చేస్తున్న పనికి సంబంధం లేకుండా కూలీ పని చేచిస్తున్నారని మండిపడ్డారు.

ప్రభుత్వ ఉద్యోగమని వివాహం చేసుకున్న తమ భర్తలకు ఎనలేని డ్యూటీలు వేసి కుటుంబంతో గడపకుండా చేస్తున్నారని ఆరోపించారు. అందరి పోలీసులకు ఒకే విధానం ఉండాలని, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాన్ని అమలు చేసి, తమ భర్తలను రక్షకభ‌టులుగా గుర్తించాలని వారు డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో ధర్నా చేస్తున్న మహిళలను అదుపులోకి తీసుకొని పోలీసులు 17వ బెటాలియన్ కు తరలించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement