Friday, November 22, 2024

నువ్వు పుట్టి అప్పుడే 6నెలలయింది..కాజల్ అగర్వాల్

సినిమా అప్డేట్స్ మాత్రమే కాకుండా.. తన కొడుకుకి సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటుంది హీరోయిన్ కాజల్ అగర్వాల్.. ఆమె కుమారుడు నీల్ పుట్టి 6 నెలలు పూర్తయిన సందర్బంగా కాజల్ తన ఇన్ స్టా ఖాతాలో ఓ ఎమోషనల్ పోస్ట్ రాసింది. అతడికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానంది. నువ్వు పుట్టి అప్పుడే 6 నెలలు పూర్తయ్యింది. కాలం ఎంతో తొందరంగా గడిచిపోయింది. ఒక యంగ్ మదర్ గా నీ విషయంలో నేను ముందు భయపడ్డాను. ఒక తల్లిగా నా కర్తవ్యాన్ని సమర్థంగా నిర్వర్తించగలనా లేదా అనుకున్నాను.

ఇప్పటికీ గొప్ప తల్లిని ఎలా అవ్వాలో నెర్చుకుంటూనే ఉన్నాను. నాకు ఎన్ని పనులు ఉన్నా.. నీ కోసం నా సమయాన్ని ఎప్పుడూ కేటాయిస్తూనే ఉంటాను.. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. నీపై శ్రద్ద చూపడంలో నేను ఎక్కడా రాజీపడను. ఇది నాకు సవాలుతో కూడుకున్నదే అయినా.. నేను పొందే ఆనందం ముందు ఆ సవాలు చిన్నదే అనిపిస్తుంది. నువ్వు రాత్రిపూట చేసే అల్లరి నాకు సంతోషాన్ని ఇస్తుంది. నీ గురించి మీ నాన్న నేను సరదాగా మాట్లాడుకుంటాం. నీకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటాను. నీకు జన్మనిచ్చే అవకాశం ఆ భగవంతుడు నాకు ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. తల్లిగా చేసే బాధ్యత గొప్పదని అంటారు. నువ్వు పుట్టి ఏడాది కావడానికి ఇంకా సగం దూరం ఉంది. మై లవ్..మై నీల్.. ” అని రాసుకొచ్చింది కాజల్. ఆమె షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement