కరీంనగర్ జిల్లాలో ఐటీ, ఈడీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. గ్రానైట్ తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడిన వ్యక్తుల ఇండ్లు, కార్యాలయాలపై బుధవారం ఉదయం నుండి ఈడీ, ఐటీ సోదాలు కొనగుతున్నాయి. కరీంనగర్ పట్టణంలోని కామన్ చౌరస్తా, మంకమ్మతో పాటు వివిధ ప్రాంతాల్లో ఐటి,ఈడి సోదాలు కొనసాగుతున్నాయి. మైనింగ్ అక్రమాలపై ఈడి, ఐటీ జాయింట్ ఆపరేషన్ చేస్తున్నది. కరీంనగర్, హైదరాబాదులో సోదాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఏకకాలంలో రెండు చోట్ల 30 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. కరీంనగర్ గ్రానైట్ అక్రమాలపై గతంలోని సీబీఐ కేసు నమోదు చేయగా.. సీబీఐతో పాటు ఈడీలో గ్రానైట్ అక్రమాలపై కేసు నమోదైంది. కామన్ ప్రాంతంలో అరవింగ్ గ్రానైట్ యజమాని అరవింద్ వ్యాసి ఇంట్లో ఈడీ సోదాలు జరుపుతోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement