Friday, November 22, 2024

సైబర్‌ భద్రతను పెంచేందుకు ఐటీ శాఖ, గూగుల్‌ కార్యాచరణ

దేశంలో ఆన్‌లైన్‌ సైబర్‌ భద్రతపై పౌరులకు అవగాహన కల్పించేందుకు ఐటీ మంత్రిత్వ శాఖ, గూగుల్‌ ఉమ్మడి కార్యాచరణను ప్రకటించాయి. సైబర్‌ భద్రతకు సంబంధించిన అక్షరాస్యత కార్యక్రమాలు, ఆన్‌లైన్‌ భద్రతపై బహుభాషా డిజిటల్‌ కంటెంట్‌, ఆన్‌లైన్‌లో సమాచారాన్ని నావిగేట్‌ చేయడంపై విద్యాపరమైన కంటెంట్‌ వంటి అనేక కార్యక్రమాల ద్వారా ‘స్టే సేఫ్‌ ఆన్‌లైన్‌’ ప్రచారాన్ని విస్తరించడానికి టెక్‌ దిగ్గజం గూగుల్‌తో కలిసి ఐటీ మంత్రిత్వశాఖ పని చేస్తుంది. ‘700 మిలియన్లకు పైగా భారతీయులు ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారు.

డిజిటల్‌ టెక్నాలజీల శక్తితో దేశం పరివర్తనాత్మక ఆవిష్కరణలను నడుపుతున్నది. ఈ క్రమంలో ఇంటర్నెట్‌ సురక్షితంగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం” అని గూగుల్‌ ఇండియా హెడ్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ సంజయ్‌ గుప్తా అన్నారు. ‘భారతదేశ జీ20 ప్రెసిడెన్సీ అంతర్జాలాన్ని ప్రోత్సహించే, కొత్త ప్రపంచ ప్రమాణాలను స్థాపించే ఇంటర్నెట్‌ నమూనాను రూపొందించడానికి ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తుంది.

- Advertisement -

ఈ పెరుగుదలతో తమను తాము రక్షించుకోవడానికి అన్ని వయసుల పౌరులకు ఆన్‌లైన్‌ ప్రమాదాలు, భద్రతా చర్యలు, సైబర్‌ పరిశుభ్రత గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది” అని మై గవ్‌ సీఈఓ ఆకాష్‌ త్రిపాఠి అన్నారు. సైబర్‌ మోసాలపై వినియోగదారు అవగాహనను పెంపొందించడానికి, సాధారణ ఆన్‌లైన్‌ స్కామ్‌లను గుర్తించడంలోను, వాటి నుండి రక్షించడానికి ఉత్తమ పద్ధతులను అనుసరించడంలో ప్రజలకు సహాయపడటానికి గూగుల్‌ సంస్థ ఐటీ మంత్రిత్వ శాఖతో కలిసి పని చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement