హైదరాబాద్, ఆంధ్రప్రభ: దేశంలోకి ప్రవేశించే మోటారు వాహనాలకు సంబంధించి… కేంద్రం సోమవారం ఓ నోటికేషన్‌ను జారీ చేసింది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఈ నోటిఫికేషన్ వివరాలిలా ఉన్నాయి. ఇతర దేశాల్లో నమోదైన నాన్ ట్రాన్స్‌పోర్ట్ (వ్యక్తిగత) వాహనాలు భారత భూభాగంలోకి పవేశించిన సందర్భాల్లొ వాటి కదలికలను తాజా నోటిఫికేషన్ ద్వారా అధీకృతమవుతాయని నోటిఫికేషన్ వెల్లడించింది. దేశంలో ఉండే సమయంలో… ఈ నిబంధనల మేరకు తిరిగే వాహనాల్లో… చెల్లుబాటయ్యే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, లేదా అంతర్జాతీయ డ్రైవింగ్ అనుమతి, చెల్లుబాటయ్యే బీమా పాలసీలలను తీసుకెళ్లాల్సి ఉంటుంది.
వీటితోపాటు నియంత్రణ ప్రమాణపత్రంలో చెల్లుబాటయ్యే కాలుష్యపత్రం(మూలదేశంలో వర్తిస్తే), ఒకవేళ తన డాక్యుమెంట్లు కాకుండా ఇతరత్రా డాక్యుమెంట్లు ఉన్నపక్షంలో అసలు పత్రాలతోపాటు జారీ చేసే అధికారం ప్రాతిపదికన అధికారికంగా ధృవీకృతమైన అధీకృత ఆంగ్ల అనువాదం తీసుకెళ్ళాల్సి ఉంటుంది. భారత్ కాకుండా మరే దేశంలోనూ తయారైన మోటారు వాహనాలు భారత భూభాగంలో స్థానిక ప్రయాణికులను, లేదా వస్తువులు, సరకులను రవాణా చేసేందుకు అనుమతిని పొందలేవు. భారత్ కాకుండా మరే దేశంలోనైనా నమోదై ఉన్న మోటారు వాహనాలు… భారత్‌లోని మోటారు వాహనాల చట్లం(1998) ప్రకారం రూపొందించిన నియమ నిబంధనలకు లోబడి, లేదా కట్టుబడి ఉండాల్సి ఉంటుంది.