చంద్రయాన్-3 ప్రాజెక్ట్‌లో మరో కీలక అడుగు ముందుకు పడింది. చంద్రుని దక్షణ ధ్రువం పైన ల్యాండ్ అయ్యి ప్రపంచంలో ఏ దేశం సాధించలేని ఘనత సాధించింది. తాజాగా ఇస్రో.. జాబిల్లి వద్దకు పంపిన ప్రొపల్షన్ మాడ్యూల్‌ను విజయవంతంగా చంద్రుడి కక్ష్య నుంచి భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇది ప్రత్యేక ప్రయోగమని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పారు.
చంద్రుడిపై నుంచి నమూనాలు సేకరించే ప్రణాళికలు చేస్తున్నామని.. తాజా ప్రయోగం ఆ మిషన్‌కు దోహదపడుతుందని తెలిపారు. నమూనాలను తీసుకొని తిరిగి వచ్చే మిషన్ కోసం వ్యూహాలు రూపొందించేందుకు ప్రొపల్షన్ మాడ్యూల్‌లోని అదనపు సమాచారం ఉపయోగపడుతుందని వెల్లడించారు.