దేశంలో స్పేస్ టెక్నాలజీ స్టార్టప్‌ల వృద్ధికి ప్రోత్సాహం ఇచ్చేందుకు ఇస్రో, మైక్రోసాఫ్ట్ మధ్య పరస్పర సహకార ఒప్పందం కుదిరింది. ఈ భాగస్వామ్యం ద్వారా ఇస్రో గుర్తించిన స్పేస్‌టెక్ స్టార్టప్‌లు స్టార్టప్‌ల ఫౌండర్స్ హబ్ ఫ్లాట్‌ఫారమ్‌లో మైక్రోసాఫ్ట్‌లోకి ప్రవేశించబడతాయి. ఇది ఆలోచనల నుంచి యునికార్న్ వరకు వారి ప్రయాణంలో ప్రతిదశలో స్టార్టప్‌లకు మద్దతు ఇస్తుంది. కృత్రిమమేథ, మెషిన్‌లెర్నింగ్, డీప్ లెర్నింగ్ వంటి అత్యాధునిక పద్ధతులను ఉపయోగించి వివిధ అప్లికేషన్‌ల కోసం భారీ మొత్తంలో శాటిలైట్ డేటాను విశ్లేషించడం, ప్రాసెస్ చేయడంలో మైక్రోసాఫ్ట్‌తో ఇస్రో సహకారం స్పేస్‌టెక్ స్టార్టప్‌లకు ఎంతో ప్రయోజనం చేకూర్చుతుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అన్నారు.
స్పేస్-టెక్ స్టార్టప్ వ్యవస్థాపకులు తమ వ్యాపారాన్ని నిర్మించడానికి నిర్వహించడానికి అవసరమైన సాంకేతిక సాధనాలు, వనరులకు ఉచిత ప్రాప్యత లభిస్తుందన్నారు. మాటెక్నాలజీ టూల్స్, ఫ్లాట్‌ఫారమ్‌లు, మెంబర్‌షిప్ అవకాశాల ద్వారా అత్యాధునిక ఆవిష్కరణలను నడపడానికి దేశంలోని స్పేస్‌టెక్‌లకు సాధికారత కల్పించడానికి కట్టుబడివున్నామని మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెండ్ అనంత్ మహేశ్వరి చెప్పారు. మైక్రోసాఫ్ట్ స్పేస్ ఇంజనీరింగ్ క్లౌడ్ టెక్నాలజీలు, ఉత్పత్తి, రూపకల్పన, నిధుల సేకరణ, అమ్మకాలు, మార్కెటింగ్ స్పేస్ టెక్ వ్యవస్థాపకులకు మార్గదర్శక మద్దతును అందిస్తుందని చెప్పారు.