Friday, November 22, 2024

ఇస్రో గూఢచర్యం కేసు.. నిందితుల బెయిల్‌ రద్దు

1994 నాటి ఇస్రో గూఢచర్యం కేసులో నిందితులు కేరళ మాజీ డీజీపీ సహా నలుగురు నిందితులకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. వారికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు ఇవ్వాల (శుక్రవారం) కొట్టివేసింది. ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై మళ్లి విచారణ జరపాలని కేరళ హైకోర్టును సుప్రీం కోరింది. జస్టిస్‌ ఎంఆర్‌ షా, సిటి రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో నలుగురు నిందితులను ఐదు వారాల పాటు అరెస్టు చేయవద్దని సీబీఐని సర్వోన్నత న్యాయస్థానం ధర్మాసనం ఆదేశించింది.

నంబి నారాయణన్‌ను గూఢచర్యం కేసులో ఇరికించిన నిందితుల్లో కేరళ మాజీ డీజీపీ సీబీ మాథ్యూస్‌, గుజరాత్‌ మాజీ ఏడీజీపీ ఆర్బీ శ్రీకుమార్‌, కేరళకు చెందిన ఇద్దరు మాజీ పోలీసు అధికారులు ఎస్‌.విజయన్‌, తంపి ఎస్‌.దుర్గాదత్‌, రిటైర్డ్‌ ఇంటెలిజెన్స్‌ అధికారి పీఎస్‌ జయప్రకాశ్‌లకు మంజూరు చేసిన బెయిల్‌ను సవాల్‌ చేస్తూ నవంబర్‌లో సీబీఐ సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement