Monday, November 25, 2024

Gaza : స్కూల్‌పై ఇజ్రాయెల్ దాడి.. 100మంది మృతి..!

గాజాలో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా తూర్పు గాజాలో నిరాశ్రయులు ఆశ్రయం పొందుతున్న ఓ స్కూల్‌పై ఇజ్రాయెల్ సేనలు దాడులు జరిపాయి. ఈ ఘటనలో ఏకంగా 100 మందికి పైగా మృతి చెందారు. చాలా మంది గాయపడ్డారు.

గత వారం కూడా మూడు పాఠశాలలపై ఇజ్రాయెల్ దాడులు జరిపింది. ఆగస్టు 4న గాజా నగరంలో నిరాశ్రయ ప్రజలకు ఆశ్రయం కల్పిస్తున్న పాఠశాలపై జరిపిన దాడిలో 30 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. అంతకుముందు రోజే నగరంలోని హమామా అనే పాఠశాలపై దాడి జరపగా ఈ దాడిలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆగస్టు 1న దలాల్ అల్-ముఘ్రాబీ స్కూల్‌పై దాడి జరిగింది. ఆ దాడిలో 15 మంది చనిపోయారు.

గ‌త ఏడాది అక్టోబరులో హమాస్‌ ఉగ్రవాదుల మెరుపు దాడుల నేపథ్యంలో.. అందుకు ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్‌ విరుచుకుపడుతోన్న విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో ఇప్పటివరకు గాజాలో 40,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. ఇటీవల జరిగిన హమాస్‌, హెజ్‌బొల్లాల కీలక నేతల హత్యల నేపథ్యంలో పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. హమాస్‌ను భూస్థాపితం చేస్తామంటూ ఇజ్రాయెల్‌ గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోంది. వాటి ధాటికి అక్కడి భవనాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, తాగునీటి వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకు దాదాపు 40 వేల మంది పాలస్తీనియన్లు మృతిచెందినట్లు స్థానిక ఆరోగ్య శాఖ వెల్లడించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement