గాజా ఆస్పత్రిలో వెయ్యి మందిని బందీ చేసిన హమాస్ ఉగ్రవాది, కమాండర్ అహ్మద్ సియామ్ హతమయ్యాడు. ఫైటర్ జెట్ దాడిలో అతను ప్రాణాలు కోల్పోయినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. గాజాలో ఉన్న ప్రజల తరలింపు ప్రక్రియను అహ్మద్ సియామ్ అడ్డుకున్నట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ దళాలు పేర్కొన్నాయి. రంతిసి ఆస్పత్రిలో బందీలను సియామ్ దాచిపెట్టనట్లు ఐడీఎఫ్ తెలిపింది.
హమాస్‌కు చెందిన నాసిర్ రద్వాన్ కంపెనీ కమాండరే అహ్మద్ సియామ్. గాజా సిటీలో ఉన్న అల్ బురాక్ స్కూల్‌లో దాచుకున్న సమయంలో జరిగిన ఫైటర్ జెట్ దాడిలో సియామ్ హతమయ్యాడు. అతనితో పాటు హమాస్ ఆపరేటివ్స్ కూడా ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. షిన్ బెట్, మిలిటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఐడీఎఫ్ ఆ దాడి చేసింది. ద గివాటీ బ్రిగేడ్ ట్రూప్స్ ఫైటర్ జెట్‌ను ఆపరేట్ చేశాయి. హమాస్ ఉగ్రవాదులు నక్కి ఉన్న స్కూల్ ప్రాంతాన్ని పేల్చేశాయి. దీంతో కీలకఉగ్రవాదులు హతమయ్యారు.