Saturday, November 23, 2024

తెలుగువారే కానీ బాలీవుడ్ ని ఏలిన దర్శకుడు.. ఇస్మాయల్ ష్రాఫ్ ఇకలేరు

పుట్టింది తెలుగుగడ్డపై..కానీ బాలీవుడ్ చిత్రాలు తెరకెక్కించి ఎనలేని పేరు గాంచారు దర్శకుడు ఇస్మాయల్ ష్రాఫ్.. ఇస్మాయిల్‌ ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో పుట్టారు. తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి సౌండ్ ఇంజినీరింగ్‌లో పట్టభద్రుడయ్యారు. కాగా ఆయన కన్నుమూశారు. ఆయన వయసు 62.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయి అంబానీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఇస్మాయిల్ నెల రోజుల క్రితం గుండెపోటుతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం అర్ధరాత్రి చనిపోయారు. బాలీవుడ్‌ దర్శకుడు భీమ్‌ సింగ్‌ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశారు. తర్వాత ‘అగర్‌’ సినిమాతో దర్శకుడిగా మారారు. అహిస్తా అహిస్తా, జిద్, అగర్, గాడ్ అండ్ గన్, పోలీస్ పబ్లిక్, మజ్ధార్, దిల్ అఖిర్ దిల్ హై, బులుండి, నిశ్చయ్, సూర్య, ఝుతా సచ్ వంటి అనేక బాలీవుడ్ సినిమాలు రూపొందించారు. తన కెరీర్‌లో దాదాపు 20 సినిమాలకు దర్శకత్వం వహించారు. 2004లో వచ్చిన ‘తోడా తుమ్ బద్‌లో తోడా హమ్‌’ ఆయన చివరి సినిమా ఆయన మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. నటులు గోవింద, పద్మిని కొల్హాపురే,అశోక్ పండిట్ ఆయనకు నివాళులర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement