సిరియా తూర్పు ప్రాంతంలో సిరియా సైనికులు ప్రయాణిస్తున్న బస్సుపై ఐసిస్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 23 మంది సిరియన్ సైనికులు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. ఐసిస్ ఆధీనం నుంచి 2017లో ఇరాన్, 2019లో సిరియా బయటపడ్డాయి. అప్పటి నుంచి సిరియాలో వరుస దాడులు జరుగుతున్నాయి. గత కొంతకాలంగా సిరియాపై ఐఎస్ఐఎస్ ఉగ్రసంస్థ దాడులకు పాల్పడుతోంది. అలాగే స్లీపర్ సెల్స్‌తో దాడులు చేయిస్తోంది.
ఇరాక్‌తో సరిహద్దుగా ఉన్న డీర్ ఎల్-జోర్ ప్రావిన్స్‌లోని తూర్పు పట్టణం మయాదీన్ సమీపంలోని ఎడారి రహదారిపై జరిగిన దాడిలో 23 మంది సిరియన్ సైనికులు మరణించారని, 10 మంది గాయపడ్డారని బ్రిటన్‌కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ తెలిపింది. జిహాదీలు బస్సును చుట్టుముట్టి కాల్పులు జరిపిన దాడి తర్వాత డజన్ల కొద్దీ సైనికులు కనిపించకుండా పోయారని పేర్కొంది .