Saturday, November 23, 2024

యాంటీ ఫంగల్‌ డ్రగ్‌ తయారీ, అమ్మకాల కోసం అనుమతులు పొందిన గుఫిక బయోసైన్సెస్‌..

హైదరాబాద్‌, మే 2 (ప్రభ న్యూస్‌) : ఫార్మాస్యూటికల్‌ పరిశ్రమలో సుప్రసిద్ధమైన గుఫిక్‌ బయోసైన్సెస్‌ లిమిటెడ్‌ (గుఫిక్‌) తమ కార్యకలాపాలు ప్రారంభించిన నాటి నుంచి వినూత్నమైన, పరిశోధనాధారిత ఫార్మాస్యూటికల్‌ ఉత్పత్తులను తీర్చిదిద్దడంలో ముందుంది. ఇటీవలనే సెంట్రల్‌ లైసెన్సింగ్‌ అప్రూవింగ్‌ అథారిటీ, సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్‌సీఓ) నుంచి ఇసావుకొనాజోనియం సల్ఫేట్‌ ఏపీఐ, ఇంజెక్షన్‌ 200ఎంజీ వయల్‌ కోసం ఫినీష్డ్‌ ఫార్ములేషన్‌ ఇసావుకొనజోల్‌ తయారీ, అమ్మకం, పంపిణీ కోసం అనుమతులు పొందింది. గుఫిక్‌ బయోసైన్సెస్‌ లిమిటెడ్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ వై నగేష్‌ మాట్లాడుతూ… ఇసావుకోనజోల్‌ అనేది ట్రయా జోల్‌ తరగతికి చెందిన యాంటీ ఫంగల్‌ డ్రగ్‌ అన్నారు. దీనిని ఇప్పటికే యుస్ ఎఫ్‌ డీఏ, యూరోపియన్‌ మెడిసన్స్‌ ఏజెన్సీలు అనుమతించాయన్నారు. మెడికల్‌ ఎఫైర్స్‌ జనరల్‌ మేనేజర్‌ డాక్టర్‌ ఆదర్శ్‌ శెట్టి మాట్లాడుతూ… కోవిడ్‌-19 సెకెండ్ వేవ్‌ భారత దేశంలో భయంకరమైన అనుభవాలను మిగిల్చిందన్నారు. కోవిడ్‌-19 రోగులలో మ్యుకోర్‌ మైకోసిస్‌ లేదా బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధి అతిపెద్ద సవాల్‌గా నిలిచిందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement