Friday, November 22, 2024

Viral Note: ఇది నిజ‌మా… రాముడి బొమ్మ‌తో అయిదు వంద‌ల నోట్లు…

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం దగ్గర పడుతోంది. ఈ సమయంలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో రూ.500 నోటు ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‎గా మారింది. జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా రూ.500 నోట్లపై గాంధీ బొమ్మకు బదులు శ్రీరాముని చిత్రాన్ని ముద్రిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది.

ఒకవైపు శ్రీరాముని చిత్రపటాన్ని అచ్చువేయగా.. నోటుకు మరొక భాగంలోని ఎర్రకోట స్థానంలో అయోధ్య ఆలయ నమూనాను ముద్రించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. స్వచ్ఛ భారత్ అని గాంధీజీ కళ్లజోడు ఉండే స్థానంలో శ్రీరాముని బాణం, విల్లు ఉండేలా రూపొందించారని, దీనికి సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది. ఈ నోటును జనవరి 22న రామమందిర ప్రతిష్ఠాపన రోజు జారీ చేయనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై రిజ‌ర్వ్ బ్యాంక్ ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement