Tuesday, November 26, 2024

ఏపీలో పోలీస్‌ వ్యవస్థ ఉందా? టీడీపీ నేత నారా లోకేష్‌

అమరావతి, ఆంధ్రప్రభ : నెల్లూరులో టీడీపీ మహిళా నేత రేవతిపై వైకాపా శ్రేణుల దాడిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తీవ్రంగా ఖండించారు. ప్రశ్నిస్తే దాడులకు తెగబడటం అధికార పార్టీ నేతల అభద్రతా భావాన్ని బయటపెడుతుందని మండిపడ్డారు. ఈ ఘటనపై ఆదివారం ట్విట్టర్‌ వేదికగా స్పందించిన ఆయన మాజీమంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌పై విమర్శలు చేశారనే అక్కసుతో రేవతి భర్తను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి వేధించడం, స్టేషన్‌కు వెళ్లిన రేవతిపై దాడి చేయడం చూస్తుంటే అసలు రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థ ఉందా అన్న అనుమానం కలుగుతుందని లోకేష్‌ వ్యాఖ్యానించారు. రేవతిపై దాడి చేసిన అధికార పార్టీ కార్యకర్తలతో పాటు ఆమె భర్తను వేధించిన పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ట్విట్టర్‌ వేదికగా డిమాండ్‌ చేశారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సోమవారం విజయవాడ కోర్టుకు హాజరు కానున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని అరెస్ట్‌ చేసిన సమయంలో ఆయన్ను కలిసేందుకు వెళ్లిన లోకేష్‌పై పోలీసులు కరోనా నిబంధనలు ఉల్లంఘించినట్లు కేసు నమోదు చేశారు. ఈ కేసులో వ్యక్తిగతంగా హాజరవ్వాలన్న మెజిస్ట్రేట్‌ ఆదేశాల మేరకు నారా లోకేష్‌ విజయవాడ అదనపు మెట్రో పాలిటన్‌ కోర్టుకు హాజరుకానున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement