Tuesday, November 26, 2024

సొంత పార్టీ వాళ్ళు చనిపోయినా చంద్రబాబుకు  సభే ముఖ్యమైందా : మంత్రి పెద్దిరెడ్డి మండిపాటు 

పుంగనూరు (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : కందుకూరు ఘటనలో 8మంది మృతిచెందడం బాధాకరం అంటూనే ”ఒకపక్క సొంత పార్టీ కార్యకర్తలు చనిపోతే, అందరూ ఇక్కడే ఉన్నండి సభ కొనసాగిస్తా అని చెప్పిన చంద్రబాబులో అధికారంలోకి రావాలన్న తన ఆరాటం కనిపిస్తుంది ” అని రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  మండిపడ్డారు. పుంగనూరులో గడప గడపకు మన ప్రభుత్వం పర్యటనలో ఉన్న ఆయన గురువారం కందుకూరులో చంద్రబాబు సభలో జరిగిన తొక్కిసలాటలో 8 మంది మరణించిన ఘటనపై స్పందించారు. ఆ ఘటనలో 8 మంది చనిపోవడం దురదృష్టం, ప్రభుత్వం తరపున చింతిస్తున్నామన్నారు. ప్రభుత్వం తరపున వారి కుటుంబాలకు అవసరమైన సహాయం అందిస్తామన్నారు. ఇరుకైన సందుల్లో, చిన్న చిన్న జంక్షన్లలో ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుందన్నారు. 

అలాంటి చోట్ల ఇలాంటి సమావేశాలకు అనుమతి ఇవ్వకూడదని సీఎస్, డిజిపి, కలెక్టర్లను కోరుతున్నానన్నారు.. ఇలాంటి ఘటనలు జరిగే ఆస్కారం లేని విశాలమైన ప్రాంతాల్లో మాత్రమే అనుమతులు మంజూరు చేయాలని కూడా సూచించారు.” కానీ చంద్రబాబు మంచి చెడ్డలు లేకుండా, అయ్యోపాపం మన కోసం వచ్చి చనిపోయారని లేకుండా అలా సమావేశం కొనసాగించడం బాధాకరమన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. కేవలం అధికారంలోకి రావాలన్న తన ఆరాటం మాత్రమే అందులో కనిపిస్తోందని” అని మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని పేపర్ లో చూసాను అంటూ లోకేష్ పాదయాత్రకు, జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుందని.. లోకేష్ పాదయాత్ర గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్ కు నమ్మకంగా ఉన్నామనే తమపై ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తుందని కూడా అన్నారు.

   
లోకేష్ పాదయాత్ర గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ” 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి, ఇన్నేళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అయన తండ్రి ప్రజలకు ఏం చేశారు. గతంలో 30 ఏళ్లు పుంగనూరు ఒకే కుటుంబం చేతిలో ఉంది, వారు అభివృద్ధి చేసుంటే ఈ రోజు ఇలా కష్టపడే పరిస్థితి ఉండేది కాదన్నారు. ఇప్పుడు మనం పెద్ద స్థాయిలో అభివృద్ధి చేస్తున్నాం. వారు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుంటే ఇప్పుడు మనకు చేయడానికి ఏమి ఉండేదికాదన్నారు. ఇదే విధంగా చంద్రబాబు, లోకేష్ రాష్ట్రం గురించి కానీ, రాష్ట్ర ప్రజల గురించి కానీ పట్టించుకోవట్లేదన్నారు. కేవలం అధికారంలోకి రావడం కోసమే చూస్తున్నారన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement