Tuesday, November 26, 2024

రఘురామకృష్ణం రాజు అరెస్ట్ దానికే సంకేతమా – సిపిఐ రామకృష్ణ

ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ ను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు. ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపిన వారిపై బెదిరింపులు, అక్రమ అరెస్టులకు పాల్పడటం దుర్మార్గమన్నారు రామకృష్ణ. ప్రజాస్వామిక వ్యవస్థకు, భావప్రకటనా స్వేచ్ఛకు ఇటువంటి ఘటనలు పెను విఘాతంగా ఉన్నాయన్నారు.

దేశమంతా కరోనాతో అల్లాడిపోతోంటే సీఎం జగన్ కక్షపూరిత విధానాలు అవలంబిస్తున్నారని విమర్శలు గుప్పించారు రామకృష్ణ. సాక్షాత్తు ఎంపీని అరెస్ట్ చేయించి, జగన్ తన పాలనను ఎవరు విమర్శించినా ఊరుకునేదిలేదనే సంకేతాలిచ్చారని ఆరోపించారు రామకృష్ణ.

Advertisement

తాజా వార్తలు

Advertisement